కన్సాస్ సిటీ : అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కొత్త చరిత్ర లిఖించాడు. సరిగ్గా నాలుగేండ్ల క్రితం అర్జెంటీనాకు ప్రపంచకప్ ్రఅందించిన మెస్సీ తాజా వరల్డ్ కప్ తొలి పోరులోనే మూడు గోల్స్‌తో మ్యాజిక్ చేశాడు. వయసు పెరిగినా.. తన ఆటలో పదును తగ్గలేదని చాటిచెప్పాడు. బుధవారం అల్జీరియాతో జరిగిన గ్రూపు-జే పోరులో మెస్సీ..అన్నీతానై అర్జెంటీనాను ముందుండి నడిపించాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా..మెస్సీ సూపర్ ప్రదర్శనతో 3-0తో అల్జీరియాపై అద్భుత విజయం సాధించింది. స్టార్ ైస్ట్రెకర్ మెస్సీ (17, 60, 76వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ (16)రికార్డు సమం చేశాడు.
టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా చాంపియన్ ఆటతీరు ప్రదర్శించింది. తమ దేశం తరఫున 200వ మ్యాచ్ ఆడుతున్న మెస్సీ చుట్టూనే ఆట తిరిగింది. మ్యాచ్ మొదలైన 5వ నిమిషానికే గోల్ నమోదైనా..ఆఫ్సైడ్తో అర్జెంటీనా ఆశ నెరవేరలేదు. అయితే మ్యాచ్ 17వ నిమిషంలో అద్భుతం జరిగింది. సహచరుడి నుంచి పాస్ అందుకున్న మెస్సీ..ప్రత్యర్థి డిఫెండర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన తీరు ప్రపంచకప్ టోర్నీకి హైలెట్‌గా నిలిచింది. గోల్ తర్వాత మెస్సీ ఒకింత భావోద్వేగానికి లోనవుతూ సహచరులతో సంబురాల్లో మునిగిపోయాడు. 1-0 ఆధిక్యంతో కీలకమైన ద్వితీయార్ధంలోకి ప్రవేశించిన అర్జెంటీనా..తమ దాడులకు మరింత పదునుపెట్టింది. 60వ నిమిషంలో సహచర ైస్ట్రెకర్ అలెక్సిస్ మాక్ అలిస్టర్ కొట్టిన బంతి అల్జీరియా గోల్‌కీపర్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రీబౌండ్ అయిన బంతిని అక్కడే ఉన్న మెస్సీ క్షణాల్లో గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో ఆధిక్యం 2-0కు చేరుకుంది. ఇలా అల్జీరియాకు ఏమాత్రం అవకాశమివ్వని అర్జెంటీనా అదే దూకుడు కొనసాగించింది. 76వ నిమిషంలో నికో గొంజాలెజ్ అందించిన పాస్‌ను అందుకున్న మెస్సీ..డిఫెండర్లను కంగుతినిపిస్తూ మూడో గోల్‌తో జట్టుకు విజయం అందించాడు. ఓవైపు అర్జెంటీనా వరుస గోల్స్‌తో దుమ్మురేపితే..అల్జీరియా ఒకసారి కూడా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేయలేకపోయింది. దాంతో తన వరల్డ్ కప్ డిఫెన్స్‌ను అర్జెంటీనా ఘన విజయంతో షురూ చేసింది.
స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబపే డబుల్ గోల్స్ తో సత్తా చాటడంతో ఫిఫా వరల్డ్ కప్‌ను గత సీజన్ రన్నరప్ ఫ్రాన్స్ ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్-ఐ మ్యాచ్‌లో 31 గోల్స్ తేడాతో సెనెగల్ ను ఓడించింది. ఆట 66వ నిమిషంలో ఎంబపే తొలి గోల్ సాధించాడు. 82వ నిమిషంలో బ్రాడ్లీ బార్కోలా జట్టు ఆధిక్యాన్ని డబుల్ చేశాడు.

ఇంజూరీ టైమ్ (90+6వ నిమిషం)లో సెనెగల్ ఒక గోల్ కొట్టి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చింది. కానీ, ఆ మరుసటి క్షణంలోనే ఎంబపే లాంగ్ రేంజ్ నుంచి మెరుపు గోల్ బాది ఫ్రాన్స్ విజయాన్ని ఖరారు చేశాడు. ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఒలీవియర్ జిరూ (57 గోల్స్) రికార్డును ఎంబపే (58 గోల్స్) బద్దలు కొట్టాడు. మరో మ్యాచ్‌లో నార్వే 4-1తో ఇరాక్‌ను చిత్తు చేసింది. గ్రూప్-జెలో ఆస్ట్రియా 3-1తో జోర్డాన్‌పై నెగ్గింది.
1 తన ఫిఫా ప్రపంచకప్ కెరీర్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేయడం మెస్సీకి ఇది తొలిసారి
16 ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జర్మనీ ప్లేయర్ మిరాస్లోవ్ క్లోజ్(16) రికార్డు మెస్సీ సమం చేశాడు.
120 అర్జెంటీనా తరఫున 200వ మ్యాచ్ ఆడిన మెస్సీ 120 గోల్స్ చేశాడు.
38 ఫిఫా వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన ఓల్డెస్ట్ ప్లేయర్ మెస్సీ(38 ఏండ్లు)
ఉజ్బెకిస్థాన్ x కొలంబియా ఉ. 7.30 నుంచి
చెక్ x దక్షిణాఫ్రికా రా. 9.30 నుంచి
స్విట్జర్లాండ్ x బోస్నియా అ.రా. 12.30 నుంచి