Head Coach | టీమ్ఇండియా హెడ్ కోచ్ జాబ్.. మోదీ, అమిత్ షా, సచిన్, షారుక్ పేరిట ఫేక్ అప్లికేషన్స్
Head Coach | టీమ్ ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ (Head Coach) పదవి కోసం బీసీసీఐ (BCCI) ఇటీవలే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. గడువు ముగిసే సరికి హెడ్ కోచ్ పదవి కోసం సుమారు 3 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అయితే వాటిలో భారీ సంఖ్యలో నకిలీ దరఖాస్తులు ఉన్నాయి.
Head Coach | టీమ్ ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ (Head Coach) పదవి కోసం బీసీసీఐ (BCCI) ఇటీవలే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రధాన కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రావిడ్ నిర్వర్తిస్తున్నాడు. అయితే జూన్ చివరి నాటికి అతని పదవీకాలం ముగియనున్నది. అమెరికాలో జరిగే టీ20 వరల్డ్‌కప్ అతనికి చివరి టోర్నీ కానున్నది. దీంతో హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ జారీ చేసిన దరఖాస్తు గడువు కూడా మే 27తో ముగిసింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసే సరికి హెడ్ కోచ్ పదవి కోసం సుమారు 3 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అయితే వాటిలో భారీ సంఖ్యలో నకిలీ దరఖాస్తులు ఉన్నాయి.
కొందరు ఆకతాయిలు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ సహా పలువురి పేర్లతో ఫేక్ అప్లికేషన్లు పంపారు. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తుల్లో చాలా వరకూ మాజీ క్రికెటర్లు, ప్రముఖుల పేర్లే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు ఫేక్ అప్లికేషన్లను ఏరివేసే పనిలో పడింది.
మరోవైపు సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ తర్వాత అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ చేస్తారు. కొత్తగా ఎంపికైన హెడ్ కోచ్ జూలై ఒకటో తేదీ నుంచి బాధ్యతలను చేపడతాడు. 2027, డిసెంబర్ 31వ తేదీ వరకు కొత్త కోచ్ తన బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.
జూలైలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌తో కొత్త కోచ్ బాధ్యతలు మొదలవుతాయి. ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ఉంటాయి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్తారు. 2025లో పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. ఆ తర్వాత ఏడాది ఇండియా, శ్రీలంక దేశాలు టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో సౌతాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు కూడా కొత్త కోచే ఉంటాడు. కోహ్లీ, రోహిత్ కెరీర్లు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. కొత్త కోచ్ ఆ ఇద్దరి స్థానాలను ఫిక్స్ చేయాల్సిన బాధ్యతలను తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు హెడ్ కోచ్ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ క్రికెట్ దిగ్గజాల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. గౌతమ్ గంభీర్, ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ (Ricky Ponting) వంటి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
Also Read..
Ajith Kumar | సూపర్ బైక్‌పై.. హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టిన అజిత్.. VIDEO
Chiranjeevi | ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి : మెగాస్టార్ చిరంజీవి
Rajasthan | ఎడారి రాష్ట్రంలో భానుడి భగభగలు.. 3,622కి చేరిన వడదెబ్బ బాధితులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

