Mohammad Nabi | ఫ్రాంచైజీ క్రికెట్లో 19 ఏళ్ల కుమారుడితో.. చరిత్ర సృష్టించిన ఆల్‌రౌండర్..!
Mohammad Nabi : క్రికెట్ దిగ్గజాల వారసులు జూనియర్ స్థాయిలో రాణించడం చూశాం. అయితే.. తండ్రీకొడుకులు ఒకే జెర్సీతో మైదానంలోకి దిగడం మాత్రం చాలా అరుదైన విషయం. ఈ అపురూపమైన ఘట్టానికి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (Bangladesh Premier League) వేదికైంది.
Mohammad Nabi : క్రికెట్ దిగ్గజాల వారసులు జూనియర్ స్థాయిలో రాణించడం చూశాం. అయితే.. తండ్రీకొడుకులు ఒకే జెర్సీతో మైదానంలోకి దిగడం మాత్రం చాలా అరుదైన విషయం. ఈ అపురూపమైన ఘట్టానికి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (Bangladesh Premier League) వేదికైంది. సోమవారం నొకాలీ ఎక్స్‌ప్రెస్ జట్టు తరుఫున అఫ్గనిస్థాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (Mohammad Nabi), అతడి కుమారుడు హసన్ ఇసాఖిల్ (Hasan Eisakhil) కలిసి ఆడారు. తద్వారా ఫ్రాంచైజీ క్రికెట్లో కలిసి ఆడిన తండ్రీకొడుకులుగా నబీ, ఇసాఖిల్ చరిత్ర సృష్టించారు.
మ్యాచ్‌కు ముందు నబీ చేతుల మీదుగా డెబ్యూట్ క్యాప్ అందుకున్నాడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన హసన్ విధ్వంసక ఆటతో రెచ్చిపోయాడు. నబీ మాదిరిగానే అతడు బ్యాట్‌ను కాస్త వంచి పట్టుకొని.. ఫ్లిక్, సొగసైన ఫుల్ షాట్లతో అలరించాడు. ఢాకా క్యాపిటల్స్ బౌలర్లను భయపెడుతూ 60 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 93 రన్స్ కొట్టాడు.
🚨 FIRST TIME IN THE HISTORY OF CRICKET 🚨
– A father and son duo is playing together in a team at the Int’l level 👏🏻
– Mohammad Nabi (41) playing with his son Hassan Eisakhil (19) in BPL 2026 🔥
– What’s your take 🤔pic.twitter.com/sW4HpDH2rB
— Richard Kettleborough (@RichKettle07) January 12, 2026
మొదట సౌమ్యా సర్కార్‌తో కలిసి హసన్ 101 రన్స్ జోడించాడు. అనంతరం 14వ ఓవర్లో నబీ క్రీజులోకి వెళ్లాడు. తండ్రి కొడుకులు దూకుడుగా ఆడి నాలుగో వికెట్‌కు 53 పరుగులు రాబట్టారు. కుమారుడితో కలిసి ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడడాన్ని నబీ ఎంతగానో ఆస్వాదించాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో అతడు పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 21-10-2023 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

