IPL 2024 | దేశవాళీలో హిట్.. ఐపీఎల్లో జాక్‌పాట్.. ఎవరీ హర్విక్..?
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) రెండో విజయంపై కన్నేసింది. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన వికెట్ కీపర్, బ్యాటర్ విష్ణు వినోద్ (Vishnu Vinod) స్థానంలో కొత్త కుర్రాడిని తీసుకుంది.
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) రెండో విజయంపై కన్నేసింది. సొంత మైదానంలో గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో పాండ్యా సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన వికెట్ కీపర్, బ్యాటర్ విష్ణు వినోద్ (Vishnu Vinod) స్థానంలో కొత్త కుర్రాడిని తీసుకుంది. సౌరాష్ట్రకు చెందిన ఈ 24 ఏండ్ల హర్విక్ దేశాయ్(Harvik Desai)తో ఒప్పందం చేసుకుంది.
గురువారం హర్విక్ను టీమ్‌లోకి ఆహ్వానిస్తూ ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఎడమ చేయి ముంజేతికి గాయం కావడంతో టోర్నీకి దూరమైన వినోద్ త్వరగా కోలుకోవాలని మరో పోస్ట్‌లో రాసుకొచ్చింది. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన హర్వీక్ గత కొంత కాలంగా దేశవాళీలో నిలకడగా రాణిస్తున్నాడు.
Saurashtra ✈️ मुंबई 🏟️
Welcome home, Harvik! 💙
The right-handed WK-batter replaces Vishnu. #MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/6D0PfgbEld— Mumbai Indians (@mipaltan) April 11, 2024
నిరుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఈ చిచ్చరపిడుగు ఓ రేంజ్లో ఆడాడు. 175 స్ట్రయిక్ రేటుతో ఏకంగా 336 రన్స్ సాధించాడు. అంతేకాదు 2018లో అండర్ -19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో హర్విక్ సభ్యుడు కూడా.
𝐂𝐀𝐍’𝐓. 𝐖𝐀𝐈𝐓. 😍🍿#MumbaiMeriJaan #MumbaiIndians #MIvRCB https://t.co/TqauPxPTlM
— Mumbai Indians (@mipaltan) April 11, 2024
పదిహేడో సీజన్లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై గెలుపు రుచి చూసింది. సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి పరుగుల ఖాతా తెరిచింది. గురువారం ముంబై జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో బిగ్ ఫైట్‌కు సిద్ధమైంది. ఇరుజట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు రెండో విజయం అందించాలనే పట్టుదలతో ఉండగా.. ఢిల్లీపై 233 పరుగులు బాదిన ముంబై బ్యాటర్లు ఈసారి ఆర్సీబీపై కూడా అదే తరహాలో చెలరేగాలనే కసితో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
- Jasprit Bumrah | చిన్నప్పుడే నాన్న ప్రేమకు దూరమయ్యా.. కెనాడాలో సెటిల్ అవ్వాలనుకున్నా
- Kanguva | సూర్య కంగువ రిలీజ్ అనౌన్స్మెంట్ అప్పుడేనా..?
- Loksabha Elections 2024 | నిరుద్యోగం, ధరల మంటపై నోరు మెదపని మోదీ : జైరాం రమేష్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

