ముంబై: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) రెండో సీజన్ విజేతగా మాఝి ముంబై నిలిచింది. పూణెలోని దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై.. శ్రీనగర్ కి వీర్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. ఆధ్యంతం ఉత్కంఠగా జరిగిన టైటిల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీనగర్.. నిర్ణీత 20 ఓవర్లలో 120/5 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 64 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా ఆఖర్లో ధాటిగా ఆడిన ముంబై విజేతగా నిలిచింది.