గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో ఏ టీం గెలిచినా ప్లేఆఫ్స్ వైపుగా మరో ముందడుగు వేసిననట్లవుతుంది. అయితే బౌలింగ్‌లో బ్యాటింగ్‌లో దూసుకుపోతున్న గుజరాత్‌ను అడ్డుకోవడం ముంబైకు సవాలుతో కూడుకున్న విషయమే.
ఇప్పటివరకు గుజరాత్ ముంబై రెండుసార్లు తలపడ్డాయి. ఒక మ్యాచ్‌లో గుజరాత్ గెలవగా మరో మ్యాచ్‌లో ముంబై గెలిచింది. అయితే ఈ రెండు టీంలు ఇప్పటివరకు వాంఖడే స్టేడియంలో ఆడలేదు. అంతేకాకుండా పరుగుల వరద పారుతున్న వాంఖడేలో మరోసారి బ్యాటర్లదే పైచేయి కానుంది.
ముంబై ఇండియన్స్: ఈ సీజన్లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవుతున్నాడు. గత 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇప్పటి వరకు కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. ౩ సార్లు ఔటయ్యాడు. మరో గుజరాత్ బౌలర్ షమీ బౌలింగ్‌లో సైతం రోహిత్‌కు మంచి రికార్డు లేదు. గత రెండు మ్యాచ్‌లలో ఆడని తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.
గుజరాత్ టైటాన్స్: బ్యాటింగ్, బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్న గుజరాత్ జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. అప్ఘాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు వరల్డ్ కప్ టీంలో చోటు సాధించడమే లక్ష్యంగా విజయ్ శంకర్ రాణిస్తున్నాడు.