KKR vs MI : ఐపీఎల్ పదిహేడో సీజన్లో అదరగొడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) సొంత మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో మ్యాచ్ 9:15 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే గంటన్నర సమయం వర్షార్పణం కావడంతో 40 ఓవర్ల మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో మాజీ సారథి నితీశ్ రానా(Nitish Rana)ను తీసుకుంది. మంబై మాత్రం ఏ మార్పులు లేకుండా ఆడుతోంది. ఇప్పటికే 8 ఓటములతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై పరువు కోసం పోరాడనుంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన పాండ్యా సేన ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలనే కసితో ఉంది.
కోల్‌కతా తుది జట్టు : సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహల్ వధేర, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), పీయూష్ చావ్లా, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.
టాస్కు గంట ముందు నుంచే ఈడెన్ గార్డెన్స్‌లో జోరుగా వాన మొదలైంది. దాంతో, షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:00 గంటలకు వేయాల్సిన టాస్‌ను వాయిదా వేశారు. 7:35 గంటలకు వాన తగ్గడంతో సిబ్బంది ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. అయినా వాతావరణం మబ్బులు కమ్మి ఉండడంతో అంపైర్లు 8:45కు పిచ్‌ను పరిశీలించారు. దాంతో, ఓవర్లను కుదించి ఇరు జట్లకు 16 ఓవర్లు కేటాయించారు.