న్యూఢిల్లీ : ముంబై స్టార్ క్రికెటర్ పృథ్వీషాకు చుక్కెదురైంది. ఈనెల 21 నుంచి మొదలయ్యే విజయ్‌హజారే వన్డే టోర్నీ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో షాకు చోటు దక్కలేదు. మంగళవారం 17 మందితో ఎంపిక చేసిన ముంబై జట్టు నుంచి ఈ యువ క్రికెటర్‌కు ఉద్వాసన పలికారు. తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్‌అలీ టీ20 టోర్నీ గెలిచిన ముంబై జట్టులో ఉన్న పృథ్వీని హజారే టోర్నీకి సెలెక్టర్లు పక్కన పెట్టారు. దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో షా స్పందిస్తూ ‘చెప్పండి దేవుడా..నేను ఇంకా ఏం చూడాలి. 65 ఇన్నింగ్స్ 55.7 సగటుతో 3399 పరుగులు, 126 స్ట్రైక్‌రేట్ ఉంది. ఎంపికకు నేను సరిపోనా? కానీ నీపై ఇంకా నమ్మకం ఉంచుకుంటాను. తిరిగి జట్టులోకి వస్తానన్న నమ్మకం నాకుంది’ అని రాసుకొచ్చాడు. విజయ్ హజారే టోర్నీలో ముంబైకి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.