IPL : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Iindians) మరో రికార్డు నెలకొల్పింది. ఛాంపియన్ ఆటకు కేరాఫ్‌గా నిలిచే ముంబై.. ఈసారి మాత్రం కెప్టెన్ల మార్పుతో వార్తల్లో నిలిచింది. పంతొమ్మిదో సీజన్లో ఏకంగా ముగ్గురి సారథ్యంలో ఆడింది. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో తాత్కాలిక నాయకుడిగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించగా.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్‌గా టాస్కు వచ్చాడు. దాంతో.. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు ముగ్గురు కెప్టెన్లతో ఆడిన రెండో జట్టుగా ముంబై అవతరించింది.
ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈసారి ఆటకంటే కెప్టెన్సీ మార్పులతో రికార్డు పట్టేసింది. పంతొమ్మిదో సీజన్లో దారు ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించిన ముంబైకి మూడో సారథిగా సీనియర్ పేసర్ బుమ్రా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత రెండు మ్యాచులకు దూరమవ్వగా.. తాత్కాలిక కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు.
A kid with a unique action bowled yorkers at will. That same kid, now a legend of the game will lead the Blue & Gold in Dharamshala.
A journey to be proud of, Captain Jasprit! 💙 pic.twitter.com/QCi1X4HhDy
— Mumbai Indians (@mipaltan) May 14, 2026
ఏమైందో తెలియదు.. ధర్మశాలలో పంజాబ్‌తో మ్యాచ్‌కు ఈ ఇద్దరూ అందుబాటులో లేరు. దాంతో.. బుమ్రాకు పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. మొత్తంగా ముంబైకి సారథ్యం వహించిన పదో ఆటగాడిగా బుమ్రా రికార్డు సాధించాడు. ఐపీఎల్ ఒకే సీజన్లో ముంబై ముగ్గురి నాయకత్వంలో ఆడడం ఇదే తొలిసారి కాదు. ఆరంభ ఎడిషన్‌లో ముగ్గురు కెప్టెన్సీ చేపట్టగా.. పంతొమ్మిదో సీజన్లో మళ్లీ అదే సీన్ రిపీటైంది.
Most captains in an IPL season:
3 – MI, 2008 (Harbhajan Singh, Shaun Pollock, Sachin Tendulkar)
3 – PWI, 2013 (Angelo Mathews, Ross Taylor, Aaron Finch)
3 – SRH, 2021 (David Warner, Kane Williamson, Manish Pandey)
3 – PBKS, 2024 (Shikhar Dhawan, Sam Curran, Jitesh Sharma)
— ESPNcricinfo (@ESPNcricinfo) May 14, 2026
1. ముంబై ఇండియన్స్ (2008లో)- హర్భజన్ సింగ్, షాన్ పొలాక్, సచిన్ టెండూల్కర్
2. పుణె వారియర్స్ ఇండియా(2013లో) – ఏంజెలో మాథ్యూస్, రాస్ టేలర్, అరోన్ ఫించ్
3. సన్‌రైజర్స్ హైదరాబాద్ (2021లో) – డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే
4. పంజాబ్ కింగ్స్(2024లో) – శిఖర్ ధావన్, సామ్ కరన్, జితేశ్ శర్మ
5. ముంబై ఇండియన్స్(2026లో) – హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.