IPL 2026 | వారెవ్వా ముకుల్.. ఉత్కంఠ పోరులో లక్నోకు విజయం
ఐపీఎల్లో ఢిల్లీ, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరు మరువకముందే మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆఖరి బంతి వరకూ ఉత్కంఠ రేగిన మ్యాచ్‌లో లక్నోనే విజయం వరించింది.
- గెలుపు ముంగిట కోల్‌కతా బోల్తా
కోల్‌కతా : ఐపీఎల్లో ఢిల్లీ, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరు మరువకముందే మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆఖరి బంతి వరకూ ఉత్కంఠ రేగిన మ్యాచ్‌లో లక్నోనే విజయం వరించింది. కేకేఆర్ నిర్దేశించిన 182 పరుగుల ఛేదనలో ఒకదశలో 128/7తో ఉన్న ఎల్ఎస్జీని ముకుల్ చౌదరి (27 బంతుల్లో 54 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అసాధారణంగా పోరాడి ఒంటిచేత్తో గెలిపించాడు. అయూశ్ బదోని(34 బంతులో 54,7 ఫోర్లు 2సిక్స్‌లు) కూడా లక్నో విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట లక్నో ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు వచ్చిన కేకేఆర్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 రన్స్ చేసింది. ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న అంగ్క్రిష్ రఘువంశీ (33 బంతుల్లో 45, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ అజింక్యా రహానే (24 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆరంభంలో మెరుపులు మెరిపించగా ఆఖర్లో పావెల్ (24 బంతుల్లో 39 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామెరూన్ గ్రీన్ (24 బంతుల్లో 32 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించి ఆ జట్టు ప్రత్యర్థి ఎదుట పోరాడగలిగే స్కోరును ఉంచగలిగారు.
హీరో ముకుల్
ఛేదనలో లక్నో దూకుడుగానే ఆడినా ఇంపాక్ట్ సబ్ వైభవ్ ఐదో ఓవర్లో ఓపెనర్లు మార్క్మ్ (22), మిచెల్ మార్ష్ (15)ను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. పంత్ (10), పూరన్ (13) సైతం విఫలమైనా ఇంపాక్ట్ ప్లేయర్ బదోని పోరాడాడు. పంత్‌తో కలిసిమూడో వికెట్ 31రన్స్ జత చేసిన అతడు.. పూరన్‌తో 22 పరుగులు జోడించాడు. ఒకపక్క వికెట్లు పడుతున్నా బదోని ఏకాగ్రత చెదరకుండా ఆడి ఆ జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే హాఫ్‌సెంచరీ తర్వాత బదోనిని అనుకుల్ రాయ్ ఔట్ చేయగా నరైన్.. షమీ (1) ని వెనక్కి పంపాడు. ఈ క్రమంలో లక్నో విజయానికి 4 ఓవర్లలో 54 పరుగులు అవసరమవగా ముకుల్ అద్భుతమే చేశాడు. అరోరా బౌలింగ్‌లో 4, 6 బాదిన అతడు.. కార్తీక్ ఓవర్లో రెండు సిక్స్లుకొట్టాడు. గ్రీన్ 19వ ఓవర్లోనూ రెండు సిక్స్‌లు, ఫోర్‌తో రెచ్చిపోవడంతో లక్నోగెలుపు సమీకరణం 6 బంతుల్లో 14కు మారింది. అరోరా వేసిన చివరి ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతడు..లాస్ట్ బాల్‌కు సింగిల్ తీసి లక్నోకు ఉత్కంఠవిజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 20 ఓవర్లకు 181/4 (రఘువంశీ 45, రహానే 41, దిగ్వేశ్ 1/25, సిద్ధార్థ్ 1/34);
లక్నో: 20 ఓవర్లకు 182/7 (ముకుల్ 54*, బదోని 54, అనుకుల్ 2/32, వైభవ్ 2/38)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

