Mohammad Kaif | సూర్యను వదిలేసి కోల్‌కతా పెద్ద పొరపాటు చేసింది : కైఫ్
Mohammad Kaif : ఐపీఎల్ 16వ సీజన్లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఓ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. సునామిలా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు ఈ 360 డిగ్రీస్ ప్లేయర్ రెచ్చిపోతున్నాడు. 'సూర్య లాంటి మ్యాచ్ ఫినిషర్, మ్యాచ్‌ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల ఆటగాడు లేక కేకేఆర్ రెండేళ్లు ఇబ్బంది పడింది' అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్(Mohammad Kaif) అన్నాడు.
Mohammad Kaif : ఐపీఎల్ 16వ సీజన్లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఓ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. సునామిలా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు ఈ 360 డిగ్రీస్ ప్లేయర్ రెచ్చిపోతున్నాడు. అతడి ధనాధన్ బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. మ్యాచ్ విన్నర్ అయిన ఇలాంటి చిచ్చరపిడుగు తమ టీమ్‌లో ఉంటే బాగుండు అనుకునే ఫ్రాంఛైజీలు లేకపోలేదు. అయితే.. అందరికంటే ఎక్కువగా బాధపడేది మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీనే అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్(Mohammad Kaif) అన్నాడు.
‘సూర్య లాంటి మ్యాచ్ ఫినిషర్, మ్యాచ్‌ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల ఆటగాడు లేక కేకేఆర్ రెండేళ్లు ఇబ్బంది పడింది’ అని కైఫ్ తెలిపాడు. కోల్‌కతా మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ కూడా ఇంతకుముందు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘సూర్య లాంటి మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం కేకేఆర్‌కు పెద్ద లోటు’ అని అతను అన్నాడు.
కేకేఆర్ జెర్సీలో సూర్య

నాలుగేళ్లు కోల్‌కతాకు
ఐపీఎల్ ప్రారంభంలో సూర్యకుమార్ యాదవ్ కోల్‌కతాకు ఆడాడు. నాలుగేళ్ల పాటు అతను ఈ ఫ్రాంఛైజీతో కొనసాగాడు. 2014లో చాంపియన్‌గా నిలిచిన జట్టులో అతను సభ్యుడు కూడా. ఆ జట్టు తరఫున 54 మ్యాచ్‌లు ఆడిన సూర్య 608 పరుగులు కొట్టాడు. అయితే.. ఎందుకనో అతడిని 2018 వేలానికి ముందు కోల్‌కతా వదులుకుంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది. అక్కడితో సూర్య దశ తిరిగింది. సంచలన బ్యాటింగ్‌తో అతను ముంబై జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
ఐపీఎల్లో తొలి శతకం
ఐపీఎల్ ప్రదర్శనతోనే ఈ ముంబై ప్లేయర్ టీమిండియాకు ఎంపికయ్యాడు. టీ20ల్లో తన జోరు కొనసాగించి నంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచాడు. ప్రస్తుతం సూర్యకు టీ20ల్లో మూడు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో కూడా వారం క్రితమే తొలి శతకం సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌పై అతను సెంచరీ కొట్టాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సూర్య వందకు చేరువయ్యాడు. 12 మ్యాచుల్లో 190 స్ట్రైక్ రేటుతో 479 పరుగులు కొట్టాడు. ఈ సీజన్ ఆరేంజ్ క్యాప్ రేసులో 5వ స్థానంలో ఉన్నాడు.
గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ కొట్టిన సూర్య(103 నాటౌట్)

ఇవి కూడా చదవండి
Sunil Gavaskar | అది నాకు భావోద్వేగభరిత సందర్భం.. ధోనీ ఆటోగ్రాఫ్‌పై సునీల్ గవాస్కర్
IPL 2023 | చెత్త షాట్లతో పెవిలియన్‌కు బ్యాట్మెన్స్ క్యూ.. కెప్టెన్ పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోచ్ నెహ్రా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

