Moeen Ali | యూటర్న్ ప్రసక్తే లేదు.. స్టోక్స్ మళ్లీ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
Moeen Ali : సొంతగడ్డపై అసమాన పోరాటంతో ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్(Ashes Series)ను డ్రా చేసుకుంది. అయితే.. సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) యాషెస్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా సీనియర్ స్పిన్నర్ మోయిన్ అలీ(Moeen Ali) కూడా అతడి బాటనే అనుసరించాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు....
Moeen Ali : సొంతగడ్డపై అసమాన పోరాటంతో ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్(Ashes Series)ను డ్రా చేసుకుంది. అయితే.. సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) యాషెస్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా సీనియర్ స్పిన్నర్ మోయిన్ అలీ(Moeen Ali) కూడా అతడి బాటనే అనుసరించాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ఆల్‌రౌండర్ వెల్లడించాడు. సోమవారం ముగిసిన ఐదో టెస్టు అనంతరం అలీ తన నిర్ణయాన్ని మరోసారి వెల్లడించాడు.
ఈ సారి తన రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్ తీసుకునే ప్రసక్తే లేదని.. కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) నుంచి మళ్లీ మెసేజ్ వస్తే ఈ సారి కచ్చితంగా దాన్ని డిలీట్ చేస్తా అని పేర్కొన్నాడు. వాస్తవానికి చాన్నాళ్ల ముందే అలీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు.. అయితే.. కెప్టెన బెన్‌స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum) స్పెషల్ రిక్వెస్ట్ వల్ల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. యాషెస్ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్(Jack Leach) గాయపడ్డాడు.
దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కెప్టెన్, కోచ్.. అభ్యర్థన మేరకు మోయిన్ అలీ టెస్టు క్రికెట్లో రీ- ఎంట్రీ ఇచ్చాడు. తాజా సిరీస్‌లో 4 మ్యాచ్‌లాడిన అలీ 180 పరుగులతో రాణించడమే కాకుండా 9 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి మ్యాచ్ అనంతరం మోయిన్ మాట్లాడుతూ.. ‘విజయంతో సిరీస్ ముగించడం సంతోషంగా ఉంది. యాషెస్ ప్రారంభానికి ముందు తిరిగి టెస్టు క్రికెట్లోకి రావాల్సిందిగా స్టోక్స్ కోరాడు. ముందు తిరస్కరించా.. కానీ స్టోక్స్ నా మాట వినలేదు.
మోయిన్ అలీ

రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ప్రోత్సహించాడు. దీంతో తిరిగి జట్టులోకి వచ్చాను. ఇక శాశ్వతంగా టెస్టులకు టాటా చెబుతున్నా. ఈ సారి స్టోక్స్ మెసేజ్ చేస్తే దాన్ని డిలీట్ చేస్తా’ అని అలీ తెలిపాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 68 టెస్టుల్లో 3,094 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన స్పిన్ మయాజాలంతో 204 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 112 పరుగులకే 10 వికెట్లు తీసి కెరీర్లో ఉత్తమ బౌలింగ్ గణాకంలు నమోదు చేశాడు.
ఇవి కూడా చదవండి
Kane Williamson | న్యూజిలాండ్ జట్టుకు శుభవార్త.. బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టిన కేన్ మామ
BCCI | భారీ ఆదాయంపై కన్నేసిన బీసీసీఐ.. టైటిల్ స్పాన్సర్ రైట్స్ టెండర్లకు పిలుపు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

