Kane Williamson : వన్డే వరల్డ్ కప్( ODI World Cup 2023) ముందు న్యూజిలాండ్ జట్టు(Newzealand)కు శుభవార్త. గాయం నుంచి కోలుకుంటున్న మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. నెట్స్‌లో సాధన చేస్తున్న వీడియోను అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈరోజు పోస్ట్ చేశాడు. దానికి ‘చాలా రోజుల తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం సంతోషంగా ఉంది’ అని క్యాప్షన్ రాశాడు. ఆ వీడియోలో విలియమ్సన్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా అన్ని రకాల షాట్లు ప్రాక్టీస్ చేశాడు.
వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని ఉందని అతను ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే వేగంగా కోలుకుంటున్న అతను బ్యాట్ పట్టడంతో న్యూజిలాండ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. న్యూజిలాండ్ జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన కేన్ విలియమ్సన్ క్రికెట్‌కు దూరమైన ఐదు నెలలపైనే కావొస్తోంది.
పదహారోసీజన్ ఐపీఎల్(IPL 2023) ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ గాయపడ్డాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కొట్టిన బంతని బౌండరీ వద్ద ఆపడానికి ప్రయత్నిచి కింద పడిపోయాడు. కుడి మోకాలికి బలమైన గాయం కావడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. కుడి కాలు బెణికిందని స్కానింగ్ తీసిన వైద్యులు చెప్పడంతో ఈ స్టార్ ఆటగాడు షాక్ తిన్నాడు. దాంతో, అర్ధాంతరంగా స్వదేశానికి పయనమయ్యాడు. అక్కడ ఈమధ్యే దెబ్బతిన్న కుడి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు.
ఐపీఎల్ 2023పోరులో గాయంతో మైదానం వీడుతున్నవిలియమ్సన్
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న భారత గడ్డపై మొదలవ్వనుంది. ఇప్పటికే ఈ మెగాటోర్నీకి 10 జట్లు పోటీలకు అర్హత సాధించాయి. వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా ఎప్పుడో వచ్చేసింది. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కివీస్ అభిమానులంతా విలియమ్సన్ త్వరగా కోలువాలని ప్రార్దించారు. ఎందుకంటే..? 2019 వరల్డ్ కప్(ODI WC 2019)లో విలియమ్సన్ కివీస్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే.. అనూహ్యంగా సూపర్ ఓవర్(Super Over)లో బ్యాక్కాప్స్ ఇంగ్లండ్(England) చేతిలో ఓటమిపాలైంది.
2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో నిరాశలో విలియమ్సన్
దాంతో, ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. విలియమ్సన్ ఆలోపు ఫిట్నెస్ సాధిస్తే కివీస్‌కు కష్టాలు తొలగినట్టే. అనుభవజ్ఞుడైన ఈ స్టార్ ఆటగాడు ఆ జట్టు మిడిలార్డర్లో ఎంతో కీలకం కానున్నాడు. అతను గనుక జట్టులోకి వస్తే.. ఈసారి న్యూజిలాండ్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగనుంది.