హైదరాబాద్, ఆట ప్రతినిధి: జర్మనీలో ఇటీవల జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణ, రజత పతకాలతో మెరిసిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌ను గురువారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. బధిరుడైనప్పటికీ శ్రీకాంత్ ఓపెన్ కేటగిరీ షూటింగ్ టోర్నీలో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధం ప్రతిష్ఠాత్మకంగా సీఎం కప్ నిర్వహించాం. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రాంగణాలను నెలకొల్పాం. దేశానికి ఆణిముత్యల్లాంటి ప్లేయర్లను అందించే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం’ అని అన్నారు.