సన్‌రైజర్స్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 15వ ఓవర్లో బంతి అందుకున్న అతను.. అదే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీశాడు. అతను వేసిన బౌన్సర్‌ను ఆడేందుకు ప్రయత్నించిన తిలక్ వర్మ (8) విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్ వైపు వెళ్లింది. అతను కంఫర్టబుల్‌గా క్యాచ్ పట్టేయడంతో తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి ఉమ్రాన్ వేసిన బంతిని మిడ్ వికెట్ వైపు బాదడానికి ప్రయత్నించాడు.
అయితే ఉమ్రాన్ తెలివిగా కొంచెం స్లోవర్ డెలివరీ వేయడంతో షాట్ సరిగా కనెక్ట్ కాలేదు. అదే సమయంలో మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రియమ్ గార్గ్ గాల్లోకి ఎగిరి అందుకున్న సూపర్ క్యాచ్‌తో అతను కూడా మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 127 పరుగులతో నిలిచింది.