కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ (6)ను ఆండ్రీ రస్సెల్ అవుట్ చేశాడు. రస్సెల్ వేసిన బాల్‌ను కట్ చేసేందుకు ప్రయత్నించిన తిలక్ వర్మ.. బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్‌లో ఉన్న రాణా వైపు వెళ్లింది. దాన్ని అతను చక్కగా అందుకోవడంతో తిలక్ వర్మ నిరాశగా మైదానం వీడాడు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై జట్టు రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.