DC vs RCB : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బిగ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ మేగ్ లానింగ్ (15) ఔట్ అయింది. ఆశా శోభన ఓవర్లో లానింగ్ (Lanning) ఇచ్చిన క్యాచ్‌ను హీథర్ నైట్ అందుకుంది. దాంతో, 70 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జెమీమా రోడ్రిగ్స్ (11), మరిజానే కాప్ (4) క్రీజులో ఉన్నారు. టచ్‌లో ఉన్న అలిసే క్యాప్సే (38) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. 9 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి 66 బంతుల్లో 77 రన్స్ కావాలి. ఓపెనర్ షఫాలీ వర్మ (0) తొలి ఓవర్ రెండో బంతికే బౌల్డ్ అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు (Royal Challengers Bangalore) 150 రన్స్ చేసింది. ఎలీసా పెర్రీ (67) హఫ్ సెంచరీతో ఆర్సీబీని ఆదుకుంది. ఆమెకు రీచా ఘోష్ (37) సహకారం అందించింది. వీళ్లిద్దరూ ఫోర్లు, సిక్స్‌లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నాలుగో వికెట్‌కు 74 రన్స్ జోడించారు. 137 పరుగుల వద్ద రీచా నాలుగో వికెట్‌గా వెనుదిరిగడంతో స్కోర్‌బోర్డు వేగం మందగించింది. పెర్రీ, రీచా ధాటికి ఆఖరి ఆరు ఓవర్లలో 82 పరుగులు వచ్చాయి. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు, తారా నోరిస్ ఒక వికెట్ తీశారు.