SA vs AUS : పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా మరో సిరీస్ పట్టేసింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా(South Africa)కు చెక్ పెడుతూ రికార్డు విజయం సాధించింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో టీ20లో గ్లెన్ మ్యాక్స్‌వెల్(62 నాటౌట్) బ్యాటింగ్ షోతో అదరగొట్టగా 2 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఛేదనలో కెప్టెన్ మిచెల్ మార్ష్(54) అర్ధ శతకంతో రాణించగా.. మిడిల్ ఓవర్లలో సఫారీ పేసర్లు వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు. అయితే.. మ్యాక్సీ తనదైన విధ్వంసంతో విరుచుకుపడగా మరో బంతి ఉండగా ఆసీస్ గెలుపొందింది.
తొలి రెండు మ్యాచుల్లో చెరొకటి గెలుపొందిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు మూడో టీ20లో హోరాహోరీగా తలపడ్డాయి. ఎప్పుడు దంచికొడుతాడో.. ఎప్పుడు డకౌట్ అవుతాడో తెలియని గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈసారి దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఊచకోతకు సిరీస్‌పై ఆశలు పెట్టుకున్న సఫారీలకు నిరాశే మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 172 కొట్టింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా గత మ్యాచ్ సెంచరీ హీరో డెవాల్డ్ బ్రెవిస్ (53) అర్ధ శతకం, డస్సెన్(38) మెరుపులతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు.
Takes a scorcher of an outfield catch to remove the rampaging Brevis & then bosses the chase after Australia slid from 66-0 to 122-6
Just Maxi things 🏅 #AUSvSA pic.twitter.com/JDCyG5DYWl
— ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2025
మోస్తరు ఛేదనలో ఓపెనర్లు మిచెల్ మార్ష్(54), ట్రావిస్ హెడ్(19) ఆసీస్‌కు శుభారంభం ఇచ్చారు. అయితే.. మర్క్మర్, కార్బన్ బాస్చ్ల విజృంభణతో పటిష్ట స్థితిలో ఉన్న మార్ష్ సేన 122కే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (62 నాటౌట్) బౌండరీల మోతతో సఫారీ బౌలర్లను హడలెత్తించాడు. 36 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, 2 సిక్సర్లతో విరుచుకుపడ్డ మ్యాక్సీ కడదాకా నిలిచి గెలుపు బాట పట్టించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బాది ఆసీస్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. తొలి, మూడో టీ20లో గెలుపొందిన మార్ష్ సేన 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన మ్యాక్సీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా.. టిమ్ డేవిడ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యారు.
Outcomes from Cairns:
▪️ Australia completed their highest successful T20I chase at home
▪️ They have now won seven of the nine 2+ T20I series played against South Africa (1 lost, 1 drawn)
▪️ This is their sixth bilateral T20I series win in their last seven (1 drawn vs England… pic.twitter.com/IXhH2dno80— ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2025