Verstappen | సుజుకా(జపాన్): జపనీస్ ఫార్ములావన్ గ్రాండ్ ప్రి రేసులో మ్యాక్స్ వెర్స్టాపెన్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన తుదిపోరును రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ 1:54:23సెకన్లలో ముగించి టాప్‌లో నిలిచాడు. సెర్గియో పెరెజ్ కార్లోస్ సెయింజ్ పోడియం ఫినిష్ చేశారు. ఈ విజయంతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకున్న వెర్స్టాపెన్ ఓవరాల్‌గా 77పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెర్గియో పెరెజ్ చార్లెస్ లెకెర్క్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.