CSK vs LSG | మార్ష్ తుఫాన్ ఇన్నింగ్స్.. చెన్నైపై లక్నో ప్రతీకార విజయం..!
CSK vs LSG : ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన జట్లకు పోటీలో లేని జట్లు షాక్‌లు ఇస్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌కు ధర్మశాలలో ముంబై ఇండియన్స్ ఝలక్ ఇవ్వగా.. విజయంతో ముందంజ వేయాలనుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది.
CSK vs LSG : ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన జట్లకు పోటీలో లేని జట్లు షాక్‌లు ఇస్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌కు ధర్మశాలలో ముంబై ఇండియన్స్ ఝలక్ ఇవ్వగా.. విజయంతో ముందంజ వేయాలనుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది. ఆకాశ్ సింగ్(3-26) విజృంభణతో 187కు సీఎస్కే పరిమితమవ్వగా.. ఛేదనలో మిచెల్ మార్ష్(90) తుఫాన్ ఇన్నింగ్స్‌తో లక్నోను గెలుపు దిశగా నడిపాడు. వెంటవెంటనే మూడు వికెట్లు పడినా.. ముకుల్ చౌదరీ(13 నాటౌట్), నికోలస్ పూరన్(32 నాటౌట్)లు ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. కంబోజ్ ఓవర్లో పూరన్ నాలుగు సిక్సర్లతో లక్నో ప్రతీకార విక్టరీ సాధించగా… చెన్నై ఐదో స్థానం వద్దే ఆగిపోయింది.
పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఆసక్తి రేపుతున్నాయి. జోరు మీదున్న జట్లు ముందంజ వేస్తాయనుకుంటే అనూహ్యంగా కంగుతింటున్నాయి. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకాలనుకున్న సీఎస్కే ఆశలకు లక్నో చెక్ పెట్టింది. 188 పరుగుల ఛేదనలో లక్నో ఓపెనర్లు దంచికొట్టారు. మిచెల్ మార్ష్(90), ఇంప్యాక్ట్ సబ్ జోష్ ఇంగ్లిస్(36)లు పోటాపోటీగా ఆడారు. చెన్నై ప్రధాన పేసర్ అన్షుల్ కంబోజ్ను ఉతికేసిన మార్ష్ 5వ ఓవర్లో నాలుగు సిక్సర్లు, ఫోర్‌తో 28 రన్స్ పిండుకున్నాడు. మార్ష్ 28 బంతుల్లోనే అర్ధ శతకం సాధించగా పవర్ ప్లేలోనే లక్నో స్కోర్ 80 దాటింది.
Unstoppable 🔥🔥
Mitchell Marsh continues to deal in maximums tonight 🚀
Updates ▶️ https://t.co/v1R8RJXPe8#TATAIPL | #KhelBindaas | #LSGvCSK | @LucknowIPL pic.twitter.com/kMyIF5WAtQ
— IndianPremierLeague (@IPL) May 15, 2026
వీరబాదుడుతో లక్ష్యాన్ని కరిగిస్తున్న ఈ జోడీని ముకేశ్ చౌదరీ విడదీశాడు. ఇంగ్లిస్‌ను ఔట్ చేయడంతో 135 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మార్ష్ రనౌటవ్వగా.. అబ్దుల్ సమద్(7)ను బౌల్డ్ చేసిన స్పెన్సర్ సీఎస్కే శిబిరంలో ఆశలు రేపాడు. టపటపా మూడు వికెట్లు పడంతో లక్నో స్కోర్ వేగానికి బ్రేకులు పడ్డాయి. అప్పటికే అవసరమైన పరుగులు తక్కువే కావడంతో ముకుల్ చౌదరీ(13 నాటౌట్), నికోలస్ పూరన్(32 నాటౌట్)లు దంచేశారు. కంబోజ్ వేసిన 17వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపిన పూరన్ లక్నోకు 7 వికెట్ల విజయాన్ని అందించాడు.
కార్తిక్ హాఫ్ సెంచరీ
ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్‌తో లక్నో సూపర్ జయింట్స్కు సవాల్ విసిరింది. ఆకాశ్ సింగ్(3-26) ధాటికి టాపార్డర్ విఫలమైనా కుర్రాడు కార్తిక్ శర్మ(71) మెరుపు అర్ధ శతకంతో లక్నో బౌలర్లను బెంబేలెత్తించాడు. ప్రధాన ఆటగాళ్లు ఔటైనా ఒత్తిడిలోనూ గొప్ప ఇన్నింగ్స్ ఆడిన కార్తిక్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. ఆఖర్లో శివం దూబే(32 నాటౌట్) ధనాధన్ ఆడడంతో స్కోర్ 180 దాటింది. ప్రిన్స్ యాదవ్‌ను ఉతికేస్తూ 6, 4, ,4, 6తో దూబే రెచ్చిపోగా సీఎస్కే నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి రన్స్ చేసింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

