ఓవల్: ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్(Marnus Labuschagne)పై ఇప్పుడు ఆన్లైన్లో జోకులు పేలుతున్నాయి. మూడవ రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో లబుషేన్ కాసేపు కునుకు తీశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న చైర్లో అతను నిద్ర తీశాడు. అయితే ఆ సమయంలో ఓ గమ్మత్తు అయిన ఘటన జరిగింది. లబుషేన్‌పై కెమెరాలు ఫోకస్ పెట్టిన సమయంలోనే.. బ్యాటర్ వార్నర్ ఔటయ్యాడు. ఆ సమయంలో నిద్రలో ఉన్న లబుషేన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. హుటాహుటిన లేచి బ్యాట్ పట్టి మైదానంలోకి వచ్చేశాడు. వార్నర్ తర్వాత బ్యాటర్ అతనే కావడంతో లబుషేన్ కునుకు నుంచి లేచి హడావుడిగా ఫీల్డ్‌లోకి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 123 రన్స్ చేసింది. లబుషేన్ 41, గ్రీన్ 7 రన్స్‌తో ఆడుతున్నారు.