Marnus Labuschagne | ఒకప్పుడు వరల్డ్ నంబర్ 1.. ఇప్పుడు జట్టుకు భారమవుతున్న యాషెస్ హీరో
Marnus Labuschagne : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్(Marnus Labuschagne) ఫామ్ లేమితో సతమతవుతున్నాడు. ఒకప్పుడు వరల్డ్ నంబర్ 1 టెస్టు బ్యాటర్‌గా వెలుగొందిన లబూషేన్ జట్టుకు భారంగా మారుతున్నాడు. నిరుడు సెంచరీల మీద...
Marnus Labuschagne : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్(Marnus Labuschagne) ఫామ్ లేమితో సతమతవుతున్నాడు. ఒకప్పుడు వరల్డ్ నంబర్ 1 టెస్టు బ్యాటర్(World No 1)గా వెలుగొందిన లబూషేన్ జట్టుకు భారంగా మారుతున్నాడు. నిరుడు సెంచరీల మీద సెంచరీలు బాదిన ఈ రైట్ హ్యాండర్ ఇప్పుడు హాఫ్ సెంచరీ కాదు కదా కనీసం 20 పరుగులు కూడా చేయలేక పోతున్నాడు.
స్వదేశంలో పాకిస్థాన్ సిరీస్‌లో అర్ధ శతకం తప్పిస్తే.. వెస్టిండీస్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ఈ స్టార్ ఆటగాడు దారుణంగా విఫలమయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో మార్నస్ 10, 1 నాటౌట్, 3, 5, 1, 2 పరుగులతో తీవ్రంగా నిరాశ పరిచాడు. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్లో అతడి సగటు తొలిసారి 50 కంటే తక్కువకు పడిపోయింది. 2019 తర్వాత లబూషేన్ సగటు దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. అయినా సరే కెప్టెన్ కమిన్స్, కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అతడికి అండగా నిలుస్తున్నారు.
యాషెస్ హీరో
2018 అక్టోబర్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన లబూషేన్ కెరీర్ 2019లో టర్న్ అయింది. ఆ ఏడాది యాషెస్ సిరీస్(Ashes Series)లో ఇంగ్లండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన అతడు నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. మొత్తంగా 353 పరుగులతో నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దాంతో, మూడో స్థానంలో పాతుకుపోయిన అతడు ఆ తర్వాత ఆడిన 12 మ్యాచుల్లో 1,591 పరుగులు సాధించాడు. 2021-22 పర్యటనలోనూ లబూషేన్ పరుగుల వరద పారించాడు. రెండు ఫిఫ్టీలు, ఒక సెంచరీతో కలిపి 335 రన్స్ కొట్టాడు.
మార్నస్ లబూషేన్

దాంతో, 51 ఇన్నింగ్స్‌ల్లోనే 3 వేల పరుగుల మైలురాయి దాటాడు. నిలకడగా రాణించి వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ దక్కించుకున్నాడు. అయితే.. నిరుడు జనవరిలో భారత పర్యటనలో ఈ టెస్టు స్పెషలిస్ట్ దారుణంగా విఫలయమ్యాడు. స్పిన్ ద్వయం అశ్విన్, జడేజాలను ఎదుర్కోలేక అపసోపాలు పడ్డాడు. దాంతో, ఆస్ట్రేలియా 0-4తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది.
వరల్డ్ కప్ జట్టులోకి అలా..
టెస్టుల్లో రికార్డులు బద్ధలు కొట్టిన లబూషేన్ 2020లో వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే.. నిరుడు వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు పేలవ ఫామ్‌లో ఉన్న అతడిని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. స్పిన్నర్ డీన్ ఎల్గర్ గాయపడడంతో స్క్వాడ్‌లో అతడికి చోటు దక్కింది. దాంతో, లబూషేన్ పలు మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్ విజయాల్లో భాగమయ్యాడు.
వరల్డ్ కప్ ట్రోఫీతో హెడ్, లబూషేన్

టీమిండియాతో జరిగిన ఫైనల్లో లబూషేన్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. షమీ విజృంభణతో 47 రన్స్‌కే మూడు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన అతడు ఓపెనర్ ట్రావిస్ హెడ్(137)కు అండగా నిలిచాడు. 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆస్ట్రేలియాను గెలుపు బాట పట్టించాడు.
ఇవి కూడా చదవండి
- INLD Leader: మాజీ ఎమ్మెల్యే హత్య కేసులో ఇద్దరు షూటర్లు అరెస్టు
- Batminton with Broom | రాకెట్‌తో కాదు.. చీపురుతో బ్యాడ్మింటన్ ఆడేశాడు.. వీడియో చూశారా..!
- CM Revanth Reddy | రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు: సీఎం రేవంత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

