Marnus Labuschagne | వరల్డ్ నంబర్ 1 లబూషేన్‌కు షాక్.. టెస్టుల్లో తొలిసారి గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు
Marnus Labuschagne : టెస్టు క్రికెట్లో వరల్డ్ నంబర్ 1 ఆటగాడు మార్నస్ లబూషేన్(Marnus Labuschagne) ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రీజులో పాతుకుపోయి పరుగలు వరద పారించడంలో ఈ ఆస్ట్రేలియన్ బ్యాటర్ సిద్ధహస్తుడు. అలాంటిది ఈ స్టార్ ప్లేయర్ యాషెస్ సిరీస్(Ashes Series)లో ఊహించని రికార్డు సాధించాడు. తొలి టెస్టులో గోల్డ్‌ను డక్(Golden Duck)గా....
Marnus Labuschagne : టెస్టు క్రికెట్లో వరల్డ్ నంబర్ 1 ఆటగాడు మార్నస్ లబూషేన్(Marnus Labuschagne) ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రీజులో పాతుకుపోయి పరుగలు వరద పారించడంలో ఈ ఆస్ట్రేలియన్ బ్యాటర్ సిద్ధహస్తుడు. అలాంటిది ఈ స్టార్ ప్లేయర్ యాషెస్ సిరీస్(Ashes Series)లో ఊహించని రికార్డు సాధించాడు. తొలి టెస్టులో గోల్డ్‌ను డక్(Golden Duck)గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఐదేళ్ల తన టెస్టు కెరీర్లో లబూషేన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడం ఇదే మొదటిసారి. 2018లో పాకిస్థాన్‌పై లబూషేన్ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు.
రెండో రోజు తొలి సెషన్లో స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) ఆసీస్‌కు షాకిచ్చాడు. డేవిడ్ వార్నర్(9)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే లబూషేన్ కీపర్ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో, ఆసీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా(36), స్టీవ్ స్మిత్(15) ఆడుతున్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 330పరుగులు వెనకబడి ఉంది.
🤩 A golden morning for @StuartBroad8…
And Marnus Labuschagne 😉 #EnglandCricket | #Ashes https://t.co/rFwd2cGy92 pic.twitter.com/q5Dt2wLK7W
— England Cricket (@englandcricket) June 17, 2023
రూట్ సెంచరీ..
ఎడ్జ్‌బాస్టన్ యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మొదటి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లేర్ చేశాడు. జో రూట్(118 నాటౌట్) సెంచరీ అనంతరం స్టోక్స్ అనూహ్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో
ఓపెనర్ బెన్ డకెట్(12) తక్కువకే వెనుదిరిగినా మరో ఓపెనర్ జాక్ క్రాలే(61) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓలీ పోప్(31), హ్యారీ బ్రూక్(31) త్వరగా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన జానీ బెయిర్‌స్టో(78), రూట్‌తో కలిసి ధనాధన్ ఆడాడు.
ఇవి కూడా చదవండి
Suryakumar Yadav – Devisha | 3 రోజులు 30 సెకన్లలో.. వెకేషన్ వీడియో షేర్ చేసిన సూర్యకుమార్ భార్య
Mahesh Babu – Ashes Series | బాజ్‌బాల్.. కొత్త తరహా క్రికెట్‌కు నిదర్శనం.. హీరో మహేశ్ బాబు ట్వీట్ వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

