DC vs MI : ఢిల్లీ పేసర్ మరిజానే కాప్ (Marizanne Kapp) దెబ్బకు ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు వికెట్ కోల్పోయింది. కాప్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతికి ఓపెనర్ యస్తికా భాటియా(1) ఔటయ్యింది. ఆ తర్వాతి బంతికి నాట్ సీవర్ బ్రంట్(0)ను బౌల్డ్ చేసింది. హ్యాట్రిక్ బాల్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ (4) అడ్డుకుంది. హేలీ మాథ్యూస్ (5) క్రీజులో ఉంది. మూడు ఓవర్లకు ముంబై రెండు వికెట్ల నష్టానికి 10 రన్స్ చేసింది.
టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ ఫీల్డింగ్ తీసుకుంది. తొలి రౌండ్లో ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్ అవుతుంది. మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి.