Mankad | మన్కడ్ పదంపై మాకు అభ్యంతరం లేదు : వినూస్ మనవడు
భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ పేరుతో మన్కడ్ పదం వాడుకలోకి వచ్చింది
Mankad : అంతర్జాతీయ క్రికెట్లో గత కొంతకాలంగా మన్కడింగ్ మీద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ పేరుతో వాడుకలోకి వచ్చిన ఈ పదాన్ని నిషేధించాలని కొందరు అంటున్నారు. అతని కుటుంబానికి గౌరవం ఇవ్వడం కోసం మన్కడ్ పదాన్ని వాడొద్దు అనేది వాళ్ల వాదన. అయితే.. వినూ మన్కడ్ మనవడు హర్ష మాత్రం తమ తాత పేరును వాడడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడు. ‘మా పేరు క్రికెట్ పదజాలంతో ముడిపడి ఉండడం అనేది గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్లో మన్కడ్ పదం కొనసాగాలి. దాంతో, మా తాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉండాలి’ అని హర్ష ఒక ప్రకటనలో తెలిపాడు.
వినూస్ మన్కడ్ పూర్తి పేరు.. ముల్వంత్రాయ్ హిమ్మత్‌లాల్ మన్కడ్. ఆల్‌రౌండర్ అయిన ఈయన 1964 నుంచి 1959 మధ్య కాలంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 44 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వినూస్ 2,109 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ 162 వికెట్లు తీశాడు. 1978 ఆగష్టు 21న ముంబైలో చనిపోయాడు. 2019 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్, నాన్‌స్ట్రైకర్ బట్లర్‌ను మన్కడింగ్ చేశాడు. అప్పటి నుంచి మన్కడింగ్‌ను నిషేధించాలంటూ కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా కూడా బౌలర్లు తరచూ మన్కడింగ్‌కు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ ఆడం జంపా మన్కడింగ్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. మెల్బోర్న్ రెనెగేడ్తో జరిగిన మ్యాచ్‌లో నాన్ స్ట్రైకర్ టామ్ రోజర్స్‌ను మన్కడింగ్ చేశాడు. అయితే.. అతను అప్పటికే బౌలింగ్ యాక్షన్ పూర్తి చేయడంతో అంపైర్ నాన్ స్ట్రైకర్‌ను అవుట్ ఇవ్వలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Adam Zampa
- Buttler
- Harsh
- Mankad
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

