Luka Modric | వచ్చే సీజన్లోనూ రియల్ మాడ్రిడ్‌కే ఆడుతా.. క్రొయేషియా కెప్టెన్ కీలక నిర్ణయం
Luka Modric : క్రొయేషియా కెప్టెన్ ల్యూకా మొడ్రిక్(Luka Modric) కీలక నిర్ణయం తీసుకున్నాడు. లాలిగా (LaLiga) క్లబ్ రియల్ మాడ్రిడ్(Real Madrid) తరఫున మరో ఏడాది కాలం ఆడబోతున్నానని ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ట్విటర్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. 'మాడ్రిడ్ నా స్వీట్ హోమ్' అని ట్వీట్ చేశాడు. దాంతో, మాడ్రిడ్ క్లబ్ ఈ మిడ్ ఫీల్డర్(Mid Fielder) కాంట్రాక్టును...
Luka Modric : క్రొయేషియా కెప్టెన్ ల్యూకా మొడ్రిక్(Luka Modric) కీలక నిర్ణయం తీసుకున్నాడు. లాలిగా (LaLiga) క్లబ్ రియల్ మాడ్రిడ్(Real Madrid) తరఫున మరో ఏడాది కాలం ఆడబోతున్నానని ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ట్విటర్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ‘మాడ్రిడ్ నా స్వీట్ హోమ్’ అని ట్వీట్ చేశాడు. దాంతో, మాడ్రిడ్ క్లబ్ ఈ మిడ్ ఫీల్డర్(Mid Fielder) కాంట్రాక్టును మరో ఏడాదికి పొడిగించింది. ఇప్పుడు మొడ్రిక్కు 37 ఏళ్లు. దాంతో, మాడ్రిడ్ తరఫున ఆఖరి సీజన్ ఆడి ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పాలని అనుకుంటున్నాడట.
మొడ్రిక్ 2012 నుంచి రియల్ మాడ్రిడ్‌కు కొనసాగుతున్నాడు. ఆ క్లబ్ తరఫున 2017 -18 సీజన్ అతడి కెరీర్లోనే బెస్ట్ అని చెప్పాలి. ఆ సమయంలోనే అతను ప్రతిష్ఠాత్మకమైన బలాన్ డిఆర్(Ballon d’Or) అవార్డు గెలిచాడు. అంతేకాదు ‘బెస్ట్ ఫిఫా బెస్ట్ ప్లేయర్'(Best FIFA Player Award), ‘యూఈఎఫ్ఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'(UEFA Player of the Year Award) అవార్డులు అందుకున్నాడు. క్రిస్టియానో రొనాల్డో తర్వాత క్లబ్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
Home Sweet Home. #Modric2024
— Luka Modrić (@lukamodric10) June 26, 2023
488 మ్యాచ్‌లు.. 23 టైటిళ్లు
ఇప్పటివరకు మాడ్రిడ్ తరఫున 488 మ్యాచ్‌లు ఆడిన ఈ మిడ్ ఫీల్డర్ 23 టైటిళ్లు సాధించాడు. వాటిలో ఐదు చాంపియన్ లీగ్ టైటిళ్లు, 4 యూరోపియన్ సూపర్ కప్స్, నాలుగు స్పానిష్ సూపర్ కప్స్ ఉన్నాయి. అద్భుతంగా రాణిస్తున్న మొడ్రిక్ క్రొయేషియా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నిరుడు ఖతర్‌లో ముగిసిన వరల్డ్ కప్‌లో తమ టీమ్‌ను సెమీస్ వరకు తీసుకెళ్లాడు. అయితే.. సెమీస్ పోరులో అర్జెంటీనా 3-0తో క్రొయేషియాను చిత్తు చేసింది. దాంతో, రెండోసారి ఫైనల్ ఆడాలనుకున్న మొడ్రిక్ కల చెదిరింది.
ఇవి కూడా చదవండి
Roger Federer | టెన్నిస్‌లో ‘ఆల్ టైమ్ గ్రేట్’ ఎవరు?.. ఫెదరర్ సమాధానం ఇదే
Womens Ashes Series | 8 వికెట్లతో చెలరేగిన గార్డ్నర్.. ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

