Roger Federer | టెన్నిస్‌లో ‘ఆల్ టైమ్ గ్రేట్’ ఎవరు?.. ఫెదరర్ సమాధానం ఇదే
Roger Federer : టెన్నిస్‌లో ఇప్పుడు 'ఆల్ టైమ్ గ్రేట్'(All Time Great) ఎవరు? అనే చర్చ నడుస్తోంది. అందుకు కారణం.. నొవాక్ జకోవిచ్(Novak Djokovic) 23 గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లతో దిగ్గజాలను వెనక్కి నెట్టడమే. ఫ్రెంచ్ ఓపెన్(French OPen) టైటిల్ నెగ్గి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సాధించాడు. దాంతో, అతనే అందరికంటే 'గొప్ప ప్లేయర్' అని కొందరు తేల్చేస్తున్నారు. ఇదే ప్రశ్న మాజీ ఆటగాడు రోజర్ ఫెదరర్(Roger Federer)కు ఎదురైంది. దానికి అతను...
Roger Federer : టెన్నిస్‌లో ఇప్పుడు ‘ఆల్ టైమ్ గ్రేట్'(All Time Great) ఎవరు? అనే చర్చ నడుస్తోంది. అందుకు కారణం.. నొవాక్ జకోవిచ్(Novak Djokovic) 23 గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లతో దిగ్గజాలను వెనక్కి నెట్టడమే. ఫ్రెంచ్ ఓపెన్(French OPen) టైటిల్ నెగ్గి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సాధించాడు. దాంతో, అతనే అందరికంటే గొప్ప ప్లేయర్ అని కొందరు తేల్చేస్తున్నారు. ఇదే ప్రశ్న మాజీ ఆటగాడు రోజర్ ఫెదరర్(Roger Federer)కు ఎదురైంది. దానికి అతను ఆసక్తికర సమాధానం చెప్పాడు. రఫెల్ నాదల్(Rafael Nadal) ఇంకా ఆడుతున్నందున గొప్ప ఆటగాడు ఎవరు? అనేది ఇప్పుడే చెప్పలేని అన్నాడు.
‘నొవాక్ జకోవిచ్ సాధించిన ఘనత చాలా పెద్దది. ‘ఆల్ టైమ్ గ్రేట్’గా పిలిపించుకునేందుకు అది సరిపోతుంది. కానీ, నాదల్ ఇంకా ఆటకు వీడ్కోలు పలకలేదు. అందుకని ఇప్పుడే ఆల్ టైమ్ గ్రేట్పై నిర్ణయానికి రాలేం’ అని ఈ దిగ్గజ ఆటగాడు తెలిపాడు. ఈ స్విస్ సొగసరి ఆటగాడు 2021లో టెన్నిస్‌కు గుడ్ బై చెప్పాడు. గ్రాస్ కోర్టులో తిరుగులేని ఫెదరర్ ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్స్ ఉన్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గాయపడ్డ నాదల్ తొడ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో, అతను ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు పలు టోర్నీలకు దూరంగా ఉన్నాడు.
జకోవిచ్, రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్

జకో రాకతో..
జకోవిచ్ టెన్నిస్‌లో ఆరంగ్రేటం చేసే సమయానికి నాదల్, ఫెదరర్ తమను నిరూపించుకున్నారు. పోటాపోటీగా టైటిళ్లు సాధిస్తూ టెన్నిస్‌ను శాసించారు. జకో రాకతో.. వారి ఆధిపత్యానికి తెరపడింది. 2008లో తొలి గ్రాండ్‌స్లామ్(Grand Slam) టైటిల్ నెగ్గిన జకోవిచ్ అనతి కాలంలోనే నాదల్, ఫెదరర్‌కు పోటీగా మారాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో అతను దిగ్గజాలను మించిపోయాడు. 23 గ్రాండ్‌స్లామ్స్‌తో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ (22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల) రికార్డును బద్ధలు కొట్టాడు. అంతేకాదు నంబర్ 1 స్థానానికి చేరాడు. అయితే.. క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిచిన కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) జకోను వెనక్కి నెట్టి టాప్ సీడ్ సొంతం చేసుకున్నాడు. అల్కరాజ్కు ఇది ఐదో ఏటీపీ టూర్ టైటిల్.
ఇవి కూడా చదవండి
Womens Ashes Series | 8 వికెట్లతో చెలరేగిన గార్డ్నర్.. ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం
World Cup Qualifiers 2023 | వన్డేల్లో నాలుగొందలు కొట్టిన జింబాబ్వే.. 14 ఏళ్ల రికార్డు బద్ధలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

