రైజర్స్ మళ్లీ..
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. రాజస్థాన్‌తో గత మ్యాచ్‌లో అద్భుత విజయంతో గాడిలో పడిందనుకున్న రైజర్స్ సొంతగడ్డపై మరోమారు తేలిపోయింది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలై ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకుంది.
- సొంతగడ్డపై ఐదో ఓటమి
- ప్రేరక్, పూరన్ విజృంభణ
- లక్నో ఘన విజయం
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. రాజస్థాన్‌తో గత మ్యాచ్‌లో అద్భుత విజయంతో గాడిలో పడిందనుకున్న రైజర్స్ సొంతగడ్డపై మరోమారు తేలిపోయింది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలై ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకుంది. క్లాసెన్, సమద్ బ్యాటింగ్‌తో పోరాడే స్కోరు అందుకున్న హైదరాబాద్.. లక్నోను నిలువరించలేకపోయింది. ప్రేరక్ మన్కడ్ అజేయ అర్ధసెంచరీతో చెలరేగగా, నికోలస్ పూరన్, స్టొయినిస్ ధనాధన్ బ్యాటింగ్‌తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొత్తంగా సొంత ఇలాఖాలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో మరో ఓటమి. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ పోరాట పటిమ కనబర్చలేకపోయింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో రైజర్స్ 182/6 స్కోరు చేసింది. క్లాసెన్ (47), సమద్ (37 నాటౌట్) ఆకట్టుకున్నారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా (2/24), యుధ్వీర్సింగ్ (1/24) రాణించారు.
లక్ష్యఛేదనలో లక్నో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ప్రేరక్ మన్కడ్ (45 బంతుల్లో 64 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో విజృంభించాడు. నికోలస్ పూరన్ (13 బంతుల్లో 44 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. స్టొయినిస్ (25 బంతుల్లో 40, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. రైజర్స్ బౌలర్లలో ఫిలిప్స్, మార్కండే, అభిషేక్‌శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రేరక్ మన్కడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరుగనున్న డబుల్ హెడర్‌లో రాజస్థాన్‌తో బెంగళూరు, చెన్నైతో కోల్‌కతా తలపడనున్నాయి.
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు
లక్ష్యఛేదనలో లక్నో ఆది నుంచే జోరు ప్రదర్శించింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన అభిషేక్శర్మను లక్నో బ్యాటర్లు స్టొయినిస్, పూరన్ చెడుగుడు ఆడుకున్నారు. స్టొయినిస్ రెండు సిక్స్‌లు కొట్టి ఔట్ అయితే అదే ఊపు కొనసాగిస్తూ పూరన్ హ్యాట్రిక్ సిక్స్‌లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. దీంతో ఒక్క ఓవర్లో 31 పరుగులు రావడంతో లక్నో ఛేదన సులభతరమైంది.
డగౌట్ వద్ద గందరగోళం
ఉప్పల్ వేదికగా జరిగిన పోరులో కొందరు అభిమానుల చర్యల వల్ల ఆటకు అంతరాయం వాటిల్లింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నోబాల్ విషయంలో లక్నో జట్టు రివ్యూ కోరగా.. బంతి సమద్ బ్యాట్‌ను తాకినట్లు తేలడంతో అంపైర్ దాన్ని సరైన బంతిగా ప్రకటించాడు. అదే సమయంలో లక్నో డగౌట్‌పైకి కొందరు అభిమానులు బోల్ట్ విసిరారు. దీంతో లక్నో ప్లేయర్లు ఒక్కసారిగా మైదానంలోకి రాగా.. అదే సమయంలో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను చూస్తూ అభిమానులు కోహ్లీ, కోహ్లీ అని బిగ్గరగా అరుపులు ప్రారంభించారు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కల్గింది.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 182/6(క్లాసెన్ 47, సమద్ 37 నాటౌట్; కృనాల్ 2/24),
లక్నో: 19.2 ఓవర్లలో 185/3(ప్రేరక్ 64 నాటౌట్, పూరన్ 44 నాటౌట్; ఫిలిప్స్ 1/10).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

