భారీ లక్ష్య ఛేదనలో లక్నోకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో యువ ఆటగాడు మనన్ వోహ్రా (19) అవుటయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన అతను.. ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. మిడ్ వికెట్ మీదుగా బంతిని ఆడే ప్రయత్నం చేసిన వోహ్రా విఫలమయ్యాడు.
అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షాబాజ్ అహ్మద్ డైవింగ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో వోహ్రా నిరాశగా మైదానం వీడాడు. ఆ తర్వాతి ఓవర్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (00) ధాటిగా ఆడాడు. సిరాజ్ వేసిన ఓవర్ తొలి రెండు బంతులకు బౌండరీ, సిక్స్ బాదాడు. ఆ తర్వాత మరో సిక్సర్ బాదాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో జట్టు 62/2 స్కోరుతో నిలిచింది.