రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో అజేయం శతకంతో అదరగొట్టిన క్వింటన్ డీకాక్ (6) అవుటయ్యాడు. సిరాజ్ వేసిన ఓవర్లో తడబడిన డీకాక్.. ఐదో బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. తర్వాతి బంతికి కూడా బౌండరీ బాదేందుకు ప్రయత్నించిన అతను.. మిడాన్‌లో ఆర్సీబీ సారధి డుప్లెసిస్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 8 పరుగులకే లక్నో జట్టు మొదటి వికెట్ కోల్పోయింది.