CSK vs LSG | టాస్ గెలిచిన లక్నో.. చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు నిలిచేనా..!
CSK vs LSG : లక్నో వేదికగా జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. ఒకవేళ సీఎస్కే ఈ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్లతో పంజాబ్ కింగ్స్‌ను కిందకు తోసేస్తుంది.
CSK vs LSG : ప్లే ఆఫ్స్‌కు గట్టి పోటీదారుగా మారిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక మ్యాచ్ ఆడుతోంది. ప్రస్తుతం ఆరు విజయాలతో ఆరో స్థానంలో ఉన్న చెన్నై నాకౌట్ రేసులో లేని లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ను ఢీ కొడుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. ఒకవేళ సీఎస్కే ఈ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్లతో పంజాబ్ కింగ్స్‌ను కిందకు తోసేస్తుంది.
పంతొమ్మిదో సీజన్ లీగ్ దశ ఆరంభంలో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్.. అదిరే విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. మే10న లక్నోపై ఐదు వికెట్ల తేడాతో నెగ్గిన సీఎస్కే.. ఈసారి కూడా గెలుపుతో ముందంజ వేయాలని భావిస్తోంది. కానీ, లక్నో మాత్రం ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలనే కసితో ఉంది. అందుకని ఎల్ఎస్జీ రెండు మార్పులతో ఆడుతోంది. దాంతో.. ఇరుజట్ల మధ్య హోరాహోరీ తప్పకపోవచ్చు.
🚨 Toss 🚨@LucknowIPL won the toss and elected to bowl first against @ChennaiIPL in Match 5️⃣9️⃣
Updates ▶️ https://t.co/v1R8RJXPe8#TATAIPL | #KhelBindaas | #LSGvCSK pic.twitter.com/1DVn5zycfW
— IndianPremierLeague (@IPL) May 15, 2026
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, మర్క్రమ్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), పూరన్, ముకుల్ చౌదరీ, షెహబాజ్, మయాంక్ యాదవ్, షమీ, ఆకాశ్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ఇంగ్లిస్, సిద్దార్థ్, దిగ్వేశ్ రథీ, హిమ్మత్ సింగ్, బదొని.
చెన్నై తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, బ్రెవిస్, దూబే, ప్రశాంత్ వీర్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరీ, స్పెన్సర్ జాన్సన్.
ఇంప్యాక్ట్ సబ్స్ – గుర్జప్నీత్ సింగ్, అకీల్ హొసేన్, సర్ఫరాజ్ ఖాన్, మాథ్యూ షార్ట్, మ్యాట్ హెన్రీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

