Lionel Messi | సాకర్ దిగ్గజం కథతో ‘వరల్డ్ కప్ డాక్యూమెంటరీ’.. విడుదలయ్యేది ఆ రోజే..!
Lionel Messi : ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ(Lionel Messi) సారథిగా అర్జెంటీనా(Arjentina)కు ఎన్నో విజయాలు అందించాడు. వాటిలో రెండేండ్ల క్రితం ఖతార్ గడ్డపై ఫిఫా వరల్డ్ కప్(World Cup) ట్రోఫీని...
Lionel Messi : ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ(Lionel Messi) సారథిగా అర్జెంటీనా(Arjentina)కు ఎన్నో విజయాలు అందించాడు. వాటిలో రెండేండ్ల క్రితం ఖతార్ గడ్డపై ఫిఫా వరల్డ్ కప్(World Cup) ట్రోఫీని గెలిచిన సందర్భం మాత్రం చాలా ప్రత్యేకం. ఆ రోజుతో సాకర్ దిగ్గజం తన ప్రపంచ కప్ ట్రోఫీ కలను నిజం చేసుకున్నాడు.
దాంతో, మెస్సీ వరల్డ్ కప్ ప్రయాణాన్ని యాపిల్ కంపెనీ డాక్యుమెంటరీగా రూపొందించింది. ‘మెస్సీస్ వరల్డ్ కప్ జర్నీ : రైజ్ ఆఫ్ ఏ లెజెండ్'(Messi’s World Cup Journey : The Rise Of A Legend) పేరుతో చిత్రీకరించిన ఈ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21న ఈ విడుదల కానుంది.
మెస్సీ జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు, కెరీర్‌లోని ముఖ్య సంఘటనలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తాయి. 17 ఏండ్ల ప్రయాణంలో ఒక విజయం. నా కథని మీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నా అని మెస్సీ తనపై వస్తోన్న డాక్యుమెంటరీపై స్పందించాడు. దాంతో, ఫుట్‌బాల్ ఫ్యాన్స్ తమ ఆరాధ్య ఆటగాడిని తెరపై చూసేందుకు ఎదురు చూస్తున్నారు.
వరల్డ్ కప్ ట్రోఫీతో మెస్సీ సంబురం

ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓడిపోయింది. దాంతో, మెస్సీ సేన పని అయిపోయినట్టే అనుకున్నారంతా. కానీ, ఆ ఓటమి నుంచి తేరుకున్న మెస్సీ సేన వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది.
బలమైన క్రొయేషియాను 3-0తో చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్లో మెస్సీ బృందానికి ఫ్రాన్స్ గట్టి పోటీనిచ్చింది. యువ కెరట ఎంబాపే(Mbappe) హ్యాట్రిక్ గోల్స్‌తో ఫ్రాన్స్‌ను గెలిపించినంత పని చేశాడు. ఆఖరికి షూటౌట్లో అర్జెంటీనా 4-2తో గెలుపొంది మూడోసారి విశ్వవిజేతగా అవతరించింది.
ఇవి కూడా చదవండి
- SA20 | సిక్సర్‌తో సెంచరీ.. ఆ తర్వాతి బంతికే ఔట్.. వీడియో
- Fennel Water | సోంపు వాటర్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

