Fennel Water | మన వంటింట్లో తప్పనిసరిగా కనిపించే పదార్ధాల్లో ఒకటైన సోంపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. కూరల్లో, సబ్జీల్లో దినుసుగా వాడటంతో పాటు ఛాయ్ వంటి పానీయాల్లోనూ సోంపు మంచి ఫ్లేవర్ తీసుకువస్తుంది. అంతెందుకు సహజసిద్ధ మౌత్ ఫ్రెషనర్‌గానూ చాలామంది సోంపును వాడుతుంటారు. సోంపు ఆహార పదార్ధాలకు రుచి, ఫ్లేవర్‌ను జోడించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది.
ఇంట్లోనే సోంపు వాటర్‌ను తయారు చేసుకుని తాగడం ద్వారా దీని ఫలితాలను పొందవచ్చు. బరువు తగ్గడం నుంచి జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం వరకూ ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుంది. భోజనానంతరం సోంపును నమలడం మన ఇండ్లలో సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇది జీర్ణక్రియ సాఫీగా చేయడంతో పాటు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు శరీరానికి మేలు చేస్తాయి.
సోంపు వాటర్‌తో బరువు తగ్గే ప్రక్రియ సులువవుతంది. సోంపులో ఉండే ఫైబర్ ద్వారా కడుపు నిండిన భావన కలిగి ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. సోంపుతో శరీరంలో కొవ్వు కరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. సోంపు జీర్ణశక్తిని మెరుగుపరచడంతో ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించే శక్తి పెరుగుతుందని న్యూట్రిషనిస్ట్, మ్యాక్రోబయాటిక్ హెల్త్ కోచ్ శిల్పా అరోరా పేర్కొన్నారు. ఇక సోంపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
జీర్ణక్రియ
బరువు తగ్గుదల
చర్మ సంరక్షణ
డీటాక్సిఫికేషన్
రుతుక్రమ సమస్యల నియంత్రణ
Read More :