Lionel Messi | మెస్సీ వరల్డ్ కప్ జెర్సీలు వేలానికి.. కనీస ధర రూ. 76 కోట్లు
Lionel Messi : అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) తన సొగసైన ఆటతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. నిరుడు ఖతర్ గడ్డపై అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. ఈ మధ్యే ఎనిమిదోసారి 'బాలన్ డీ ఓర్'(Ballon d'Or) అవార్డు అందుకున్న ఈ దిగ్గజ ఫుట్‌బాలర్... అభిమానులకు గుడ్‌న్యూస్....
Lionel Messi : అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) తన సొగసైన ఆటతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. నిరుడు ఖతర్ గడ్డపై అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. ఈ మధ్యే ఎనిమిదోసారి ‘బాలన్ డీ ఓర్'(Ballon d’Or) అవార్డు అందుకున్న ఈ దిగ్గజ ఫుట్‌బాలర్… అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. 2022 వరల్డ్ కప్‌లో తాను ధరించిన 10 వ నంబర్ జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల చికిత్స కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు మెస్సీ వెల్లడించాడు.
అర్జెంటీనాకు చెందిన సోత్‌బైస్ అనే కంపెనీ మెస్సీ జెర్సీలను వేలం వేయనుంది. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో ధరించిన జెర్సీతో కలిపి మొత్తం ఆరు జెర్సీలకు రూ. 76 కోట్ల కనీస ధర నిర్ణయించింది. వేలంలో మెస్సీ జెర్సీలకు క్రీడా చరిత్రలోనే కనీవినీ ఎరుగని ధర పలకుతుందని సోత్‌బైస్ కంపెనీ అంటోంది. వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సాంట్ జాన్ డె డూ బార్సెలోనా పిల్లల దవాఖాన నిర్వహిస్తున్నయునికాస్ ప్రాజెక్ట్(Unicas Project)కు మెస్సీ డొనేట్ చేయనున్నాడు.
అర్జెంటీనా కంపెనీ వేలం వేయనున్న మెస్సీ జెర్సీలివే

నిరుడు ఖతర్‌లోని లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మెస్సీ రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, 36 ఏళ్ల తర్వాత మళ్లీ అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు 35 ఏళ్ల మెస్సీ వరల్డ్ కప్ కల కూడా నెరవేరింది. దాంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకు తగ్గట్టే మెస్సీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. వరల్డ్ కప్ విజయం తర్వాత టీమ్ రూమ్‌లో అతను టేబుల్ ఎక్కి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. కప్పు గెలిచి స్వదేశం చేరుకున్న మెస్సీ బృందానికి ఘన స్వాగతం లభించింది. వరల్డ్ కప్ అనతరం పీఎస్జీ క్లబ్‌ను వీడిన మెస్సీ అమెరికాకు చెందిన ఇంటర్ మియామి క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
-
US Navy plane | రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన భారీ విమానం.. సిబ్బంది సేఫ్
-
Public Voice | కేసీఆర్.. కొడుకు లెక్క ఆసరా అయితాండు.. తండ్రి లెక్కే చూసుకుంటున్నడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

