Lionel Messi: ఈజిప్ట్ కోచ్ వర్సెస్ మెస్సీ.. మైదానంలో తీవ్ర ఉద్రిక్తత.. వీడియో
Lionel Messi: ఈజిప్ట్ కోచ్ హసన్, అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ మధ్య వాగ్వాదం జరిగింది. స్టన్నింగ్ రీతిలో మ్యాచ్ నెగ్గిన అర్జెంటీనాపై.. ఈజిప్ట్ కోచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండు చేతులను X తరహాలో చూపిస్తూ.. ఈజిప్ట్ కోచ్ నిరసన వ్యక్తం చేశారు. ఓ ఈజిప్ట్ కోచింగ్ సభ్యుడికి రెడ్ కార్డు జారీ చేశారు.
అట్లాంటా: ఫిఫా వరల్డ్‌కప్‌లో అనూహ్య రీతిలో అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో ఈజిప్ట్‌పై గెలిచిన విషయం తెలిసిందే. ఓ దశలో 0-2 గోల్స్ తేడాతో వెనుకబడ్డ అర్జెంటీనా.. ఆఖరి నిమిషాల్లో ప్రత్యర్థిని స్టన్ చేసింది. అయితే మ్యాచ్ ముగిసిన సమయంలో.. ఈజిప్ట్ కోచ్ హోసమ్ హసన్, అర్జెంటీనా కెప్టెన్ లియోనిల్ మెస్సీ(Lionel Messi) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మైదానంలోని టచ్‌లైన్ వద్ద .. ఈజిప్ట్ కోచ్ దూకుడుగా ప్రవర్తించారు. మిగితా కోచింగ్ సిబ్బంది కూడా మెస్సీపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆ కోచింగ్ స్టాఫ్ వ్యక్తికి రెడ్‌కార్డ్ జారీ చేశారు. అర్జెంటీనా స్టన్నింగ్ రీతిలో నెగ్గడంతో.. మైదానంలో నాటకీయ పరిణామం చోటుచేసుకున్నది. ఈజిప్ట్ కోచ్ హసన్ ఓ దశలో తన చేతులతో ఓ విభిన్నమైన సంకేతాన్ని చేశారు. అర్జెంటీనా ప్లేయర్ మెసీపై దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ.. తన చేతులను X తరహాలో క్రాస్‌లో పెట్టి నిరసన వ్యక్తం చేశాడు. మెస్సీని ఉద్దేశిస్తూ ఈజిప్ట్ కోచ్ నిరసన వ్యక్తం చేయడంతో.. అక్కడే ఉన్న ఫిఫా మ్యాచ్ అఫీషియల్స్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
ఫైనల్ విజిల్ తర్వాత టచ్‌లైన్ వద్ద ఉన్న హసన్ దిశగా మెస్సీ వెళ్లాడు. అయితే ఆ ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో తెలియదు. కానీ ఈజిప్ట్ కోచ్ తన చేతులను X రూపంలో పెట్టి నిరసన వ్యక్తం చేశారు. మెస్సీపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ఈజిప్ట్ కోచ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. అతనిపై ఫిఫా నియమావళి ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ ఘటనకు చెందిన ఆడియోను రిలీజ్ చేయలేదు. హసన్ ఇచ్చిన సంకేతం అర్థం కావడం లేదు అని ఫిఫా, ఈజిప్ట్ ఫుట్‌బాల్ సంఘం పేర్కొన్నది. మెస్సీ, హసన్ మధ్య గొడవ జరుగుతున్న సమయంలోనే ఈజిప్ట్ కోచింగ్ స్టాఫ్ అక్కడకు చేరుకున్నది. ఓ సభ్యుడు తన సహనాన్ని కోల్పోయి.. మెస్సీ మీదకు దూసుకెళ్లాడు. ఆ వెంటనే అర్జెంటీనా ప్లేయర్లు వచ్చి మెస్సీని చుట్టుముట్టారు. మ్యాచ్ అఫీషియల్స్, సెక్యూర్టీ సిబ్బంది కూడా చేరుకున్నారు.
రెండు గోల్స్‌తో లీడింగ్‌లో ఉన్న ఈజిప్ట్ .. ఆఖరి నిమిషాల్లో షాక్ అయ్యింది. అర్జెంటీనా తేరుకుని వెంటవెంటనే గోల్స్ చేయడంతో ఈజిప్ట్ 3-2 తేడాతో ఖంగుతిన్నది. అయితే మ్యాచ్ రిఫరీలు అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఈజిప్ట్ ఆరోపించింది. భారీ అప్సెట్ తప్పదనుకున్న తరుణంలో.. మెస్సీ సేన అనూహ్య రీతిలో పరాభవం నుంచి గట్టెక్కింది. దీంతో ఈజిప్టు కోచ్‌తో సహా ప్లేయర్లు కూడా అర్జెంటీనాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు అన్యాయం చేశారని ఈజిప్ట్ కోచ్ ఆరోపించారు. ఈ వరల్డ్‌కప్‌కు చెందిన మిగితా మ్యాచ్‌లను ఇక చూడబోనని ఈజిప్ట్ కోచ్ తెలిపారు.
Lionel Messi asks Egypt’s coach Hossam Hassan: 🗣️ «What’s wrong with you?»
FT: 🇦🇷 Argentina 3-2 Egypt 🇪🇬 🍿
⚽ Yasser Ibrahim
⚽ Mostafa Ziko
⚽ Christian Romero
⚽ Lionel Messi
⚽ Enzo Fernandez https://t.co/WAzfFA2bxK pic.twitter.com/t0WQZhGzC4— ShowTime Promotions (@ShowTimePromoUg) July 8, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

