సావో పాలో: బ్రిటన్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. పదోస్థానం నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్.. బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టోర్నీలో టైటిల్ దక్కించుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన రేసులో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ టాప్‌లో నిలువగా, వెర్స్టాపెన్(రెడ్‌బుల్), బొటాస్(మెర్సిడెస్) పోడియం ఫినిష్ చేశారు. ఈ విజయంతో లూయిస్ 25 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.