ICC ODI Rankings | కప్ చేజారినా నంబర్ 1 ర్యాంక్.. తొలిసారి టాప్-10లో జెమీమా..!
ICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మెరిసిన క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్ (ICC ODI Rankings )లో సత్తా చాటారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకంతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చింది.
ICC ODI Rankings : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మెరిసిన క్రికెటర్లు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకంతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చింది. అయితే.. భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు మాత్రం దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) షాకిచ్చింది. పదమూడో సీజన్ ప్రపంచకప్‌లో సఫారీలకు కప్ అందించలేకపోయిన లారా వ్యక్తిగతంగా మైలురాయికి చేరుకుంది. కెరీర్లోనే అత్యుత్తమంగా 814 రేటింగ్ పాయింట్స్‌తో నంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకుంది.
వరల్డ్ కప్ ముందు నుంచి టాప్‌లో ఉన్న మంధాన టోర్నీ ముగిసే ఒక ర్యాంక్ కోల్పోయింది. స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో శుభారంభాలు ఇస్తూ ఒక సెంచరీ, ఒక అర్ధ శతకంతో టీమిండియా విజయంలో కీలకమైన తను రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది. ప్రపంచ కప్‌లో సూపర్ ఫామ్ కొనసాగించి వరుసగా రెండు శతకాలు బాదిన లారా వన్డేల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
Laura Wolvaardt is new No.1 batter in women’s ODIs 🔝 🇿🇦
She overtakes Smriti Mandhana with a career-high rating of 814 pic.twitter.com/8qspZxzcRD
— ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2025
అదిరే బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను ముందుండి నడిపించిన ఆమె ఫైనల్లోనూ 101 రన్స్‌తో పోరాడిన జట్టును గెలిపించలేకపోయింది. అయితే.. టోర్నీలో 571 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన లారా టీమిండియా వైస్ కెప్టెన్ మంధానను రెండో స్థానానికి నెట్టేసింది. ప్రస్తుతం మంధాన ఖాతాలో 811 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీ20 బ్యాటర్ల జాబితాలోనూ ఆమె రెండో స్థానంలోనే కొనసాగుతోంది.
ఆ సెంచరీతో టాప్‌లోకి
వరల్డ్ కప్ నాకౌట్ పోరులో ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ సెంచరీ జెమీమా రోడ్రిగ్స్‌కు ప్లస్ అయింది. పటిష్టమైన ఆసీస్ పేస్ దళాన్ని ఎదుర్కొని 127 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్ చేర్చిన జెమ్మీ.. ఏకంగా తొమ్మిది స్థానాలు మెరుగుపరచుకొని మొదటిసారి వన్డే ర్యాంకిగ్స్‌లో టాప్ -10లోకి దూసుకొచ్చింది. సెమీస్‌లో భారత్‌పై సెంచరీతో మెరిసిన ఫొబే లిచ్‌ఫీల్డ్ 13 స్థానాలు మెరుగుపడి.. 13వ స్థానం సాధించింది. 215 పరుగులు, 22 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైన దీప్తి శర్మ (Deeptis Sharma) ఆల్‌రౌండర్ల విభాగంలో నాలుగో ర్యాంక్‌కు ఎగబాకింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

