IPL 2024 CSK vs KKR : చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు పెద్ద షాక్. తొలి బంతికే డేంజరస్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(0) వెనుదిరిగాడు. దేశ్‌పాండే ఓవర్లో జడేజా చేతికి చిక్కాడు. దాంతో, కోల్‌కతా ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్(0), అంగ్క్రిష్ రఘువంశీ(1)లు క్రీజులో ఉన్నారు.
చెపాక్ వేదికగా జరుగుతున్న 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్రస్తుతానికి కోల్‌కతా హ్యాట్రిక్ విజయాలతో టాప్‌లో ఉండగా.. ఢిల్లీ చేతిలో కంగుతిన్న చెన్నై నాలుగో స్థానంలో కొనసాగుతోంది.