న్యూఢిల్లీ: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా జట్టు టీ విరామ సమయానికి 56 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 రన్స్ చేసింది. హ్యాండ్స్కోంబ్ 36, కమ్మిన్స్ 23 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. తొలి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. రెండో సెషన్లో కూడా మూడు వికెట్లను చేజార్చుకున్నది. అశ్విన్ ఒక్కడే మూడు వికెట్లు తీసుకున్నాడు.
Tea on Day 1 of the 2nd Test.#TeamIndia get three wickets in the afternoon session with Australia on 199/6 at Tea.
Scorecard – https://t.co/hQpFkyZGW8 #INDvAUS @mastercardindia pic.twitter.com/3gxh960JS8
— BCCI (@BCCI) February 17, 2023
ఆసీస్ బ్యాటర్ ఖవాజ 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జడేజా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఖవాజ కొట్టిన రివర్స్ స్వీప్ షాట్‌తో బంతి గాలిలోకి ఎగిరింది. అయితే షార్ట్ మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ జంప్ చేసి ఒంటి చేతితో క్యాచ్ పట్టేశాడు.
ICYMI – WHAT. A. CATCH 😯😯
WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK
— BCCI (@BCCI) February 17, 2023