KL Rahul | ‘కాఫీ విత్ కరణ్’ ఎపిసోడ్ నన్ను భయపెట్టింది.. తొలిసారి సస్పెండ్ అయ్యాను
KL Rahul : భారత జట్టు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) 2019లో పెద్ద దుమారం రేపిన 'కాఫీ విత్ కరణ్' (Coffee With Karan) షో గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి తాను పాల్గొన్న ఎపిసోడ్ తనను ఎంతో భయపెట్టిందని రాహుల్ అన్నాడు.
KL Rahul : భారత జట్టు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) వీడ్కోలు వార్తలను ఖండించాడు. తన పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో వెలిసిన రిటైర్మెంట్ పోస్ట్ అంతా ఫేక్ అని తేల్చేశాడు. తాజాగా రాహుల్ 2019లో పెద్ద దుమారం రేపిన ‘కాఫీ విత్ కరణ్’ (Coffee With Karan) షో గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి తాను పాల్గొన్న ఎపిసోడ్ తనను ఎంతో భయపెట్టిందని రాహుల్ అన్నాడు. నిఖిల్ కామత్ అనే యూట్యూబర్‌తో మాట్లాడిన రాహుల్.. ఆ ఇంటర్వ్యూ తనను ఎంతో మార్చేసిందని తెలిపాడు.
‘భారత్‌కు ఆడినప్పుడు నేను ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉండేవాడిని. కానీ, కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూతో నాపై చాలా ప్రభావమే పడింది. నా జీవితంలో నేను ఎప్పుడూ సస్పెండ్ కాలేదు. స్కూల్ రోజుల్లోనూ నాపై ఏ రిమార్క్ లేదు. అలాంటిది ఆ ఇంటర్వ్యూ నన్ను ఎంతో భయపెట్టింది. ఆ ఎపిసోడ్ కారణంగా నేను జట్టులో స్థానం కోల్పోయా.

అయితే.. అంతకుముందు నేను ట్రోలింగ్‌ను పాజిటివ్‌గానే తీసుకునేవాడిని. అప్పుడు నేను చాలా యంగ్. కానీ, రెండేండ్ల తర్వాత నేను చాలా ట్రోలింగ్‌కు గురయ్యా. కూర్చున్నా, నిల్చొన్నా అదే పనిగా ట్రోల్ చేసేవాళ్లు’ అని రాహుల్ తెలిపాడు. శ్రీలంక పర్యటనలో విఫలమైన ఈ స్టార్ ఆటగాడు దేశవాళీలో చెలరేగేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో జరుగబోయే దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో పరుగుల వరద పారించేందుకు రాహుల్ నెట్స్‌లో కఠిన సాధన చేస్తున్నాడు.

హిందీలో కాఫీ విత్ కరణ్ షో ఎంతో పాపులర్. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించే ఈ షోలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సమయంలో ఇద్దరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో, మహిళలను అగౌరపరిచారంటూ ఇద్దరిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అనంతరం పాండ్యా, రాహుల్‌లను బీసీసీఐ కొన్ని రోజులు సస్పెండ్ చేసింది.
ఇవి కూడా చదవండి
-
N Convention | నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ.. - Nagarjuna | నాగార్జునకు హైకోర్టులో ఊరట..ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని కీలక ఉత్తర్వులు
- Intermediate Fees | ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ పూర్తి చేయాలంటే.. ఫీజు ఎంతో తెలుసా?
- Power Cuts | రోజులో 40 సార్లు విద్యుత్ అంతరాయం.. ఫొటోలతో సహా అధికారుల ట్వీట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

