KL Rahul | దులీప్ ట్రోఫీలో యాభై.. సర్ఫరాజ్ స్థానంలో రాహుల్.?
KL Rahul : భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) టెస్టుల్లో సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు స్క్వాడ్‌లో ఒకడైన రాహుల్ ఈసారి తన స్థానం పదిలం చేసుకోవడమే లక్ష్యంగా ఆడనున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీ (Duleep Trophy 2024)లో ఇండియా ఏ తరఫున అర్ధ శతకం బాదడం కూడా ఈ సొగసరి ఆటగాడికి కలిసి రానుంది.
KL Rahul : భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) టెస్టుల్లో సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు స్క్వాడ్‌లో ఒకడైన రాహుల్ ఈసారి తన స్థానం పదిలం చేసుకోవడమే లక్ష్యంగా ఆడనున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీ (Duleep Trophy 2024)లో ఇండియా ఏ తరఫున అర్ధ శతకం బాదడం కూడా ఈ సొగసరి ఆటగాడికి కలిసి రానుంది. అయితే.. బంగ్లాదేశ్ టెస్టులో రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఐదో స్థానంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న అతడిని మళ్లీ అదే స్థానంలో పంపాలని మేనేజ్మెంట్ భావిస్తుందని టాక్. అదే జరిగితే.. డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆరో స్థానంలో ఆడాల్సి వస్తుంది. రాహుల్ గత మూడు మ్యాచుల్లో ఓ సెంచరీ కొట్టాడు. అది కూడా దక్షిణాఫ్రికాపై. ఈ మధ్య అతడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌ల్లో అదొకటి. ఇక గాయపడడానికి ముందు ఉప్పల్ టెస్టులో 86 పరుగులతో రాణించాడు. అయితే.. అతడిపై వేటు వేయలేదు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడంతే.

తాజాగా దులీప్ ట్రోఫీలో రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇక సర్ఫరాజ్ విషయానికొస్తే.. అతడు చాలా గొప్పగా ఆడుతున్నాడు. ఎవరికైనా గాయమైతే అతడు ఆడడం పక్కా. అయితే.. జట్టు మేనేజ్మెంట్ బంగ్లాదేశ్ సిరీస్ ఒక్కటే చూడడం లేదు. ఆస్ట్రేలియా సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని గతంలో ఆడిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటోంది అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతేకాదు కారు యాక్సిడెంట్ తర్వాత జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ (Rishabh Pant) తుది జట్టులో ఉండడం ఖాయం అనిపిస్తోంది.
🚨 NEWS 🚨- Team India’s squad for the 1st Test of the IDFC FIRST Bank Test series against Bangladesh announced.
Rohit Sharma (C), Yashasvi Jaiswal, Shubman Gill, Virat Kohli, KL Rahul, Sarfaraz Khan, Rishabh Pant (WK), Dhruv Jurel (WK), R Ashwin, R Jadeja, Axar Patel, Kuldeep… pic.twitter.com/pQn7Ll7k3X
— BCCI (@BCCI) September 8, 2024
గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై చెలరేగిన పంత్ భారత జట్టు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. అందుకని రాంచీ టెస్టు హీరో ధ్రువ్ జురెల్‌కు నిరీక్షణ తప్పకపోవచ్చు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సెప్టెంబర్ 19న తొలి టెస్టు జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 27 కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో టెస్టు నిర్వహించనున్నారు.
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
ఇవి కూడా చదవండి
- GST | క్యాన్సర్ రోగులకు కేంద్రం తీపికబురు..! మందులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు చెప్పిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- Raghu Thatha | ఓటీటీలో రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?
- Massive Student Protest | మణిపూర్‌లో డ్రోన్, క్షిపణి దాడులకు వ్యతిరేకంగా.. విద్యార్థుల భారీ నిరసన
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

