KKR vs SRH | కోల్‌కతా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైన సన్‌రైజర్స్
KKR vs SRH | కోల్‌కతా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు అసలే ఫామ్‌లో లేని సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో జట్టు స్పల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది.

కోల్‌కతా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు అసలే ఫామ్‌లో లేని సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో జట్టు స్పల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎదుర్కొన్న తొలి బంతికే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే ఎన్నో ఆశలు పెట్టుకున్న జేసన్ రాయ్ (10) కూడా అవుటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (26) కాసేపు బౌండరీలతో అలరించాడు. కానీ కాసేపటికే రనౌట్‌గా వెనుతిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ (6) నిరావపరిచాడు. అబ్దుల్ సమద్ (25) నాలుగు సిక్సర్లతో ఊపుమీద కనిపించినా, కాసేపటికే శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాట్స్మెన్లు జేసన్ హోల్డర్ (2), రషీద్ ఖాన్ (8), భువనేశ్వర్ కుమార్ (7), సిద్దార్థ కౌల్ (7) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌతీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా, షకిబ్ అల్ హసన్ ఒక వికెట్ కూల్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

