IPL 2023 | ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి కోల్‌కతా స్టార్.. కారణం ఏంటంటే..?
IPL 2023: ఐపీఎల్ పదహారో సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు షాక్. ఆ జట్టు స్టార్ ప్లేయర్ లిట్టన్ దాస్(Litton Das) టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. కుటుంబంలో ఒకరు అత్యవసర చికిత్స(Medical Emergency) తీసుకుంటున్న కారణంగా అతడు బంగ్లాదేశ్‌కు బయలుదేరాడు
IPL 2023: ఐపీఎల్ పదహారో సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు షాక్. ఆ జట్టు స్టార్ ప్లేయర్ లిట్టన్ దాస్(Litton Das) టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. కుటుంబంలో ఒకరు అత్యవసర చికిత్స(Medical Emergency) తీసుకుంటున్న కారణంగా అతడు బంగ్లాదేశ్‌కు బయలుదేరాడు. ఈ విషయాన్ని కోల్‌కతా యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
‘లిట్టన్ దాస్ ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్‌కు వెళ్తున్నాడు. కుటుంబంలో ఒకరు తీవ్ర అనారోగ్యం కారణంగా అత్యవసర వైద్యం తీసుకుంటున్నారు. ఈ కష్ట సమయంలో కు మా మద్దతు తెలియజేస్తున్నాం’ అని ఆ పోస్ట్‌లో వెల్లడించింది. అయితే.. అతడు ఎప్పుడు తిరిగొస్తాడు? జట్టుతో ఎప్పుడు కలుస్తాడు? అనే దానిపై ఫ్రాంఛైజీ యాజమాన్యం ఇప్పటివరకైతే స్పందించలేదు.
ఒకే ఒక మ్యాచ్
సొంత గడ్డపై ఐర్లాండ్‌తో టెస్టు మ్యాచ్ విజయం తర్వాత లిట్టన్ దాస్ భారత్ వచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు అతను ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ బంగ్లాదేశ్ కెప్టెన్ ఓపెనర్‌గా వచ్చాడు. కానీ, కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో బోణీ కొట్టింది. వరుసగా పరాజయాల తర్వాత ఎట్టకేలకు కోల్‌కతా విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 21 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జేసన్ రాయ్(56),కెప్టెన్ నితీశ్ రానా(48) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 200 రన్స్ కొట్టింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(54) అర్థ శతకం బాదినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 రన్స్ మాత్రమే చేసింది.
ఇవి కూడా చదవండి
Wrestlers Protest | రెజ్లర్లకు మాజీ క్రికెటర్ల మద్దతు.. న్యాయం చేయాలంటూ సోషల్‌మీడియాలో పోస్టులు
Pakistan ODI victories | వన్డేల్లో 500 విజయాలు సాధించిన మూడో జట్టుగా పాకిస్థాన్.. మొదటి, రెండో స్థానాల్లో ఉన్న జట్లేవో తెలుసా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

