CSK | ధోనీ కెప్టెన్సీలోనూ మారని చెన్నై రాత.. బ్యాటింగ్ వైఫల్యంతో అవమానకర ఓటమి
ఐపీఎల్లో ఐదు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఈ సీజన్లో సారథి మారినా ఆ జట్టు రాత మారలేదు. రుతురాజ్ గాయపడటంతో దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా.. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.
- చెన్నై చిత్తుచిత్తుగా
- సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ షో
- కోల్‌కతా భారీ విజయం
CSK | చెన్నై : ఐపీఎల్లో ఐదు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఈ సీజన్లో సారథి మారినా ఆ జట్టు రాత మారలేదు. రుతురాజ్ గాయపడటంతో దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా.. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్ వైఫల్యంతో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులకే పరిమితమైంది. అందరూ విఫలమైనా గుడ్డిలో మెల్లలా శివమ్ దూబె (29 బంతుల్లో 31 నాటౌట్, 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సునీల్ నరైన్ (3/13) బంతితో పాటు బ్యాట్ (18 బంతుల్లో 44, 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తోనూ రాణించి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనను కోల్‌కతా 10.1 ఓవర్లలోనే దంచేసింది. ఈ సీజన్లో కోల్‌కతాకు ఇది మూడో విజయం కాగా చెన్నైకి ఇది వరుసగా ఐదో ఓటమి.
వచ్చారు.. వెళ్లారు..
31/2. తొలి పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరిది. ప్రత్యర్థి జట్లన్నీ పవర్ ప్లేలో వీరబాదుడు బాదుతూ వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడుతుంటే చెన్నై ఆటతీరు మాత్రం నానాటికీ తీసికట్టుగా మారుతుందనడానికి ఈ స్కోరే నిదర్శనం. ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్న రచిన్ (4) మళ్లీ నిరాశపరచగా కాన్వే (12), రుతురాజ్ స్థానంలో వచ్చిన త్రిపాఠి (16) అతడినే అనుసరించారు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన విజయ్ శంకర్ (29) నిలదొక్కుకున్నట్టే కనిపించినా స్పిన్నర్ల రాకతో అతడూ నిష్క్రమించాడు. కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి చెన్నై మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. అశ్విన్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా జడేజా, దీపక్ హుడా డకౌట్ అయ్యారు. చెన్నై భారీ ఆశలు పెట్టుకున్న సారథి ధోనీ (1) కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. దూబె ఆఖరిదాకా క్రీజులో నిలిచినా అతడూ బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. ఐపీఎల్లో చెన్నైకి ఇది రెండో అత్యల్ప స్కోరు కాగా చెపాక్‌లో ఇదే మొదటిది. నరైన్‌తో పాటు కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (2/22), హర్షిత్ రాణా (2/16) పొదుపుగా బౌలింగ్ చేసి చెన్నైని కట్టడిచేశారు.
దంచిన నరైన్
స్వల్ప లక్ష్యాన్ని తొందరగా పూర్తిచేసి నెట్ రన్‌రేట్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఖలీల్ తొలి ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్‌తో ఛేదన మొదలెట్టిన నరైన్.. క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. డికాక్ (23) మూడు సిక్సర్లు కొట్టి ఊపుమీదే కనిపించినా తక్కువ స్కోరుకే నిష్క్రమించాడు. కానీ రహానే అండతో నరైన్ రెచ్చిపోయాడు. ఖలీల్ 6వ ఓవర్లో 6, 4తో రెచ్చిపోయాడు. రహానే, రింకూ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
1 చెపాక్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం చెన్నైకి ఇది తొలిసారి
ఐపీఎల్లో చెన్నై వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇది మొదటిసారి
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 103/9 (దూబె 31 నాటౌట్, విజయ్ 29, నరైన్ 3/13, హర్షిత్ 2/16)
కోల్‌కతా: 10.1 ఓవర్లలో 107/2 (నరైన్ 44, డికాక్ 23, నూర్ 1/8, అన్షుల్ 1/19)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

