Kane Williamson | మూడోసారి తండ్రి అయిన కేన్ మామ.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన సారా
Kane Williamson | కేన్ భార్య సారా రహీం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విలియమ్సన్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ఈ జంటకు ఇప్పటికే ఓ బాబు, పాప ఉన్నారు.
Kane Williamson | న్యూజిలాండ్ మాజీ సారథి, అభిమానులంతా కేన్ మామ అని పిలుచుకునే కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రి అయ్యాడు. కేన్ భార్య సారా రహీం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విలియమ్సన్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ఈ జంటకు ఇప్పటికే ఓ బాబు, పాప ఉన్నారు. ఫిబ్రవరి 28న కేన్ మామ ముచ్చటగా మూడో బిడ్డకు తండ్రి అయ్యాడు.
ఇన్‌స్టా వేదికగా విలియమ్సన్ స్పందిస్తూ… ‘ఇక ఇప్పుడు ముగ్గురు. అందమైన పాపాయికి ఈ ప్రపంచంలోకి స్వాగతం. ఈ లోకంలోకి జాగ్రత్తగా వచ్చినందుకు చాలా థ్యాంక్యూ. అద్భుతమైన ప్రయాణం ముందుంది..’ అంటూ రాసుకొచ్చాడు. కేన్ మామ ఈ విషయం చెప్పగానే ఆ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
2015 నుంచి రిలేషన్షిప్లో ఉంటున్న కేన్ – సారాలు ఇప్పటివరకూ తమ పెళ్లిని అధికారికంగా ధ్రువీకరించలేదు. 2020లో ఈ జోడీకి పాప పుట్టగా 2022 మేలో బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పుడు కేన్ మామ.. ఐపీఎల్ 2022లో బయో బబుల్ నుంచి వెళ్లిపోయిన విషయం విదితమే. ఇక తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌కు మిస్ అయిన విలియమ్సన్.. ఫిబ్రవరి 29 నుంచి మొదలుకాబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవలే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు.. వరుస మ్యాచ్‌లలో సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

