ECB : యాషెస్ సిరీస్‌లో చతికిలపడుతున్న ఇంగ్లండ్ (England) చావోరేవో పోరుకు సిద్దమవుతోంది. పెర్త్, బ్రిస్బేన్‌లో దారుణంగా ఓడిన పర్యాటక జట్టు మూడో మ్యాచ్‌లో గెలిచి తీరాలనే కసితో ఉంది. అడిలైడ్ వేదికగా బుధవారం మొదలయ్యే మూడో టెస్టులో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచేందుకు అవకాశముంది. దాంతో.. ఆస్ట్రేలియాకు షాకిచ్చి పరవు కాపాడు కోవాలనుకుంటున్న బెన్ స్టోక్స్ (Ben Stokes) సేనకు ఈ మ్యాచ్ కోసం కీలకమార్పు చేసింది. పేస్ బౌలింగ్ యూనిట్లో గస్ అట్కిన్సన్ స్థానంలో జోష్ టంగ్ (Josh Tongue)ను తీసుకుంది.
ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్‌లో సమిష్టి వైఫల్యంతో కంగుతిన్న ఇంగ్లండ్ అడిలైడ్‌లో అద్భుతం చేయాలనుకుంటోంది. బజ్‌బాల్ ఆటను నమ్ముకుని చేతులు కాల్చుకున్న బెన్ స్టోక్స్ సేన ఈసారి సంప్రదాయ ఆటతోనే ఆసీస్‌కు చెక్ పెట్టాలని భావిస్తోంది. మూడో టెస్టుకు రెండు రోజులే ఉండడంతో ఆనవాయితీ ప్రకారం ముందుగానే ఇంగ్లండ్ బోర్డు తుది జట్టును ప్రకటించింది. గత రెండు టెస్టులు ఆడిన వాళ్లను అలానే కొనసాగించిన ఈసీబీ.. పేసర్ అట్కిన్సన్ బదులు యంగ్ సంచలనం జోష్ టంగ్‌ను ఎంపిక చేసింది.
⬅️ Gus Atkinson
➡️ Josh TongueWe’ve made one change to our starting XI for the third Test in Adelaide 📋
— England Cricket (@englandcricket) December 15, 2025
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొట్టిన జోష్ టంగ్ రెండేళ్ల క్రితం సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. స్వదేశంలో ఐర్లాండ్‌పై తొలి మ్యాచ్ ఆడిన ఈ కుడి చేతివాటం పేసర్‌కు ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌ల అనుభవమే ఉంది. అయితే.. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను ఇరకున పెట్టే ఈ స్పీడ్‌స్టర్.. 4.04 ఎకానమీతో 31 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన.. 5/66.
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), విల్ జాక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.