Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు
Josh Inglis: ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో రెండేసి సెంచరీలు చేసిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో అతను సెంచరీ చేశాడు.
న్యూలాండ్స్: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో బ్యాటర్ జోష్ ఇంగ్లిస్( Josh Inglis) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో అతను గురువారం సెంచరీ చేశాడు. దీంతో మూడు ఫార్మాట్లలో రెండేసి సెంచరీలు చేసిన ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడతను. మూడవ రోజు ఆస్ట్రేలియా 429 రన్స్ కు ఆలౌటైంది. ఇంగ్లిస్ 135 బంతుల్లో 102 రన్స్ చేశాడు. దాంట్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో కనీసం రెండు సెంచరీలు చేసిన ఘనతను ఇంగ్లిస్ దక్కించుకున్నాడు.
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఇంగ్లిస్ రెండేసి సెంచరీలు నమోదు చేశాడు. ఈ మైలురాయి అందుకున్న తొలి ఆస్ట్రేలియా బ్యాటర్‌గా ఇంగ్లిస్ నిలిచాడు. ఆరు టెస్టులు ఆడిన అతను 286 రన్స్ చేశాడు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 102. ఇక 43 వన్డేలు ఆడి 1100 రన్స్ చేశాడు. వన్డేల్లో హయ్యెస్ట్ స్కోరు 120. టీ20ల్లో 49 మ్యాచ్‌లు ఆడి 1033 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు 110 రన్స్. అయితే మూడు ఫార్మాట్లలో అతనికి రెండేసి సెంచరీలు ఉన్నాయి.
ఆసీస్ బ్యాటర్లలో ఇంగ్లిస్, మ్యాక్స్‌వెల్, ఫించ్ మాత్రమే టీ20ల్లో మల్టిపుల్ సెంచరీలు చేశారు. మ్యాక్స్‌వెల్ టెస్టుల్లో ఒకే సెంచరీ చేశాడు. కానీ ఫించ్ టెస్టుల్లో సెంచరీ చేయలేదు.
2nd Test Match Hundred For Josh Inglis An Incredible Innings From Him Brings It Up In Style With A Reserve Sweep For Four 😍🔥 https://t.co/ZOlLMmAMrg
— Cricket Dani (@CricketDani56) October 29, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ఎంపీ వద్దిరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

