ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 14వ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో భారత్తో జరిగిన సిరీస్లో గాయంతోనే బరిలోకి దిగిన ఆర్చర్ వన్డే సిరీస్ మధ్యలోనే శస్త్ర చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆర్చర్ చేతి వేలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. తాజాగా గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఆర్చర్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు.
సెకండ్ XI కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా ససెక్స్ 2nd XI, సర్రే 2nd XI మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆర్చర్ ససెక్స్ తరఫున బ్యాటింగ్ కూడా చేశాడు. ప్రస్తుతానికైతే బ్యాటింగ్ మాత్రమే చేసిన ఆర్చర్ తర్వాత నెమ్మదిగా బౌలింగ్ కూడా వేయనున్నాడు. ఫిట్నెస్ సాధించడంతో పాటు ఫామ్లోకి వస్తే మళ్లీ జాతీయ జట్టులోకి రానున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Jofra Archer made his return to action today, batting for the Sussex 2nd XI against Surrey's 2nd XI 🙌 pic.twitter.com/2TxCA9z2oD
— ESPNcricinfo (@ESPNcricinfo) May 4, 2021