Joe Root | టెస్టుల్లో మరో మైలురాయి అందుకున్న రూట్.. 10వేల రన్స్, 50వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా ఘనత
టెస్టుల్లో 10 వేల రన్స్, 50 వికెట్లు, 150కి పైగా క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా రూట్
Joe Root : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మరో మైలురాయి అందుకున్నాడు. టెస్టుల్లో పది వేల పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డు సృష్టించాడు. ముల్తాన్ స్టేడియంలో జరిగిన పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో అతను ఈ ఘనతకు చేరువయ్యాడు. 70వ ఓవర్లో పాకిస్థాన్ బ్యాటర్ ఫహీం అష్రఫ్‌ను అవుట్ చేయడంతో రూట్ టెస్టుల్లో 50 వికెట్ల క్లబ్లో చేరాడు. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వా మాత్రమే టెస్టుల్లో 10వేలకు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీశారు. కలిస్ టెస్టుల్లో 13,289 రన్స్ చేయడమే కాకుండా 292 వికెట్లు తీశాడు. స్టీవ్ వా ఖాతాలో 10,927 పరుగులు, 92 వికెట్లు ఉన్నాయి. రూట్ టెస్టుల్లో 10,629 రన్స్ స్కోర్ చేశాడు. అయితే.. కలిస్, స్టీవ్ వా రిటైర్ కావడంతో ఈ జాబితాలో రూట్ టాప్ ప్లేస్‌కు వెళ్లే అవకాశం ఉంది.
టెస్టుల్లో 10 వేల రన్స్, 50 వికెట్లు, 150కి పైగా క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా రూట్ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కలిస్ 200 క్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. రూట్ 166 క్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. రెండో టెస్టులో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. మొదటి టెస్టులో కూడా నెగ్గిన ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో టెస్ట్ డిసెంబర్ 17న కరాచీలో జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

