RCB vs PBKS | కోహ్లీ, అయ్యర్ అర్ధశతకాలు.. పంజాబ్ గెలిచి నిలిచేనా..!
RCB vs PBKS : పంజాబ్ కింగ్స్ బౌలర్లకు చుక్కులు చూపిస్తూ ధర్మశాలలో వెంకటేశ్ అయ్యర్(73 నాటౌట్), విరాట్ కోహ్లీ(58) అర్ధ శతకాలతో కదం తొక్కారు.
RCB vs PBKS : పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్‌కి అడుగు దూరంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ కొట్టింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు చుక్కులు చూపిస్తూ ధర్మశాలలో వెంకటేశ్ అయ్యర్(73 నాటౌట్), విరాట్ కోహ్లీ(58) అర్ధ శతకాలతో కదం తొక్కారు. పడిక్కల్(45)తో విరాట్ కీలక భాగస్వామ్యం నెలకొల్పగా.. ఆ తర్వాత అయ్యర్, టిమ్ డెవిడ్(28)లు ఉతికేశారు. దాంతో, పంజాబ్ ముందు కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది బెంగళూరు.
ధర్మశాలలో టాస్ ఓడిన ఆర్సీబీ ఆదిలోనే ఓపెనర్ జాకబ్ బెథెల్(11) వికెట్ కోల్పోపోయింది. విరాట్ కోహ్లీ(58), దేవ్‌దత్ పడిక్కల్45() పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని స్కోర్ బోర్డును ఉరికించారు. బ్రార్ ఓవర్లో పడిక్కల్ వెనుదిరిగగా.. అర్ధ శతకం అనంతరం చాహల్ బౌలింగ్‌లో మిడ్వికెట్లో ప్రియాన్ష్ చేతికి చిక్కాడు కోహ్లీ. అప్పటికే స్కోర్ 140 దాటింది.
Innings Break!#RCB power along to 2⃣2⃣2⃣/4 👌
Will RCB seal a playoffs spot or will #PBKS return to winning ways? 🤔
Scorecard ▶️ https://t.co/3u5qL0Zn75#TATAIPL | #KhelBindaas | #PBKSvRCB pic.twitter.com/E98F5nbmKB
— IndianPremierLeague (@IPL) May 17, 2026
కోహ్లీ ఔటయ్యాక వెంకటేశ్ అయ్యర్(73 నాటౌట్), టిమ్ డెవిడ్(28)లు.. విధ్వంసక ఆటతో పంజాబ్ పేసర్లకు గుబులు పుట్టించారు. ముఖ్యంగా అయ్యర్ భారీ షాట్లతో చెలరేగి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరో ఎండ్‌లో డేవిడ్ సైతం దంచేయగా.. స్కోర్ 200 దాటింది. చివరి ఓవర్లో 14 పరుగులు రావడంతో ఆర్సీబీ 222 రన్స్ చేసింది. పంబాజ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లతో రాణించాడు.
Seizing the opportunity in style 👌
Updates ▶️ https://t.co/3u5qL0Zn75#TATAIPL | #KhelBindaas | #PBKSvRCB | @venkateshiyer pic.twitter.com/VMHmF39cr5
— IndianPremierLeague (@IPL) May 17, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

